Home /News /crime /

NAGPUR WOMAN ARRESTED FOR KILLED HUSBAND FOR HAVING FOUR MORE WIVES SU

భర్త చేతులు కుర్చీకి కట్టేసిన భార్య.. శారీరకంగా ఒక్కటైన జంట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫ్రెండ్ ఆఫీసులో ఉన్న భర్తను కలిసేందుకు ఆ మహిళ అక్కడికి వెళ్లింది. ఆ తర్వాత అతడి చేతులను కూర్చికి కట్టేసింది. ఇలా వారిద్దరు శారీరకంగా సన్నిహితంగా మెలిగారు.

    ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసింది. అతని ఇదివరకే నలుగురు భార్యలు ఉండటం, కొన్ని విషయాల్లో విభేదాల కారణంగా ఆమె ఈ దారుణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. జరిపట్కాకు 65 ఏళ్ల లక్ష్మణ్ రామ్‌లాల్ గతంలో ఓ ఆస్పత్రిలో శానిటైజేషన్ వర్కర్‌కు పనిచేసేవాడు. ప్రస్తుతం రిటైర్డ్ అయ్యాడు. అయితే అతనికి గతంలో నలుగురితో వివాహం అయింది. 28 ఏళ్ల స్వాతి లక్ష్మణ్ మాలిక్ అనే మహిళ అతనికి ఐదో భార్య. అయితే స్వాతికి జన్మించిన చిన్న కుమారుడిని తన కొడుకుగా అంగీకరించేందుకు లక్ష్మణ్ నిరాకరించాడు. స్వాతి శీలాన్ని శంకించిన అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు.

    ఈ క్రమంలోనే స్వాతి.. లక్ష్మణ్‌పై తీవ్ర ఆగ్రహం పెంచుకుంది. సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన లక్ష్మణ్ తన ఫ్రెండ్ ఆఫీస్‌కు చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్వాతి.. లక్ష్మణ్‌ను కలిసేందుకు అక్కడికి వెళ్లింది. అక్కడ లక్ష్మణ్‌ చేతులను కుర్చీకి కట్టేసింది. ఇలా వారిద్దరు శారీరకంగా సన్నిహితంగా మెలిగారు. ఆ తర్వాత స్వాతి..లక్ష్మణ్ గొంతును కత్తితో కోసింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయింది.

    ఇక, లక్ష్మణ్ మృతికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లక్ష్మణ్ ఉంటున్న స్థలం వద్ద స్వాతిని డ్రాప్ చేసినట్టు ఓ క్యాబ్ డ్రైవర్ చెప్పాడు. దీంతో పోలీసులు స్వాతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో ఆమె నేరాన్ని అంగీకరించింది. దీంతో నాగ్‌పూర్ పోలీసులు గురువారం ఆమెను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. స్వాతి, లక్ష్మణ్ మధ్య డబ్బు విషయంలో వివాదం ఉందని తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Maharashtra, Wife kill husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు