హోమ్ /వార్తలు /క్రైమ్ /

అందుకే అల్లుడిని దశమ గ్రహం అన్నారు.. ఇల్లరికం అల్లుడు ఏంచేశాడో తెలుసా..?

అందుకే అల్లుడిని దశమ గ్రహం అన్నారు.. ఇల్లరికం అల్లుడు ఏంచేశాడో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Maharashtra: కూతురుకి ఘనంగా పెళ్లి చేశారు. తమ అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నారు. అయిన కూడా.. కట్న కానుకలు బాగానే ఇచ్చారు. అయితే, అల్లుడి ఎప్పుడు ఏదో ఒకటి కావాలని భార్యను వేధించేవాడు.

కొంత మంది అల్లుళ్లు, అత్త మామలను వేయించుకుని తింటుంటారు. పెళ్లప్పుడు డబ్బులు ఇచ్చిన కూడా, ఏదో ఒకటి కావాలని నిత్యం భార్యకు నరకం చూపిస్తుంటారు. కొన్ని సార్లు.. ఇది గొడవలు, హత్యల వరకు వెళ్తుంటుంది. మరికొందరు ప్రతి కొత్త పండుగ నాడు... బట్టలు, బంగారం పెట్టాలని వేధిస్తుంటారు. మరికొందరు, పొలాలు, బంగ్లాలు రాసివ్వాలని భార్యపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు.

దీంతో భార్యలు తమ కాపురం నిలబట్టుకొవడానికి తల్లిగారింటికి వెళ్లి తమ గొడును చెప్పుకుంటారు. కొంత మంది తమ కూతురు మోహం చూసి అల్లుడికి అడిగినంత ఇస్తుంటారు. అందుకే మన పెద్దలు అల్లుడిని గ్రహలతో పోలుస్తుంటారు. గ్రహాలు ఎలాగైతే పీడిస్తారో.. కొంత మంది అల్లుళ్లు కూడా అలానే , డబ్బులు, వస్తువులు కావాలని వేధిస్తుంటారు. కొంత మంది అల్లుళ్లువీరికి పూర్తిగా భిన్నంగా ఉంటారు. అయితే, ఒక ఇల్లరికం అల్లుడి నిర్వాకం ప్రస్తుతం వార్తలో నిలిచింది.


పూర్తి వివరాలు.. మహారాష్ట్రలో (maharashtra) అమానుషం జరిగింది. నాగపూర్ (nagpur)  ప్రాంతంలోని అమర్ నరగ్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది. నర్మూ సీత యాదవ్ (40), కల్పన యాదవ్ లకు 2013 లో పెళ్లి జరిగింది. ఇతను పెళ్లైనప్పటి నుంచి అత్తగారింట్లోనే ఉంటున్నాడు. ఇతడిని ఇల్లరికం (Family disputes) తెచ్చుకున్నారు. భగవాన్ రావరే (75), పుష్ప రావరే(70) లు ఇతని అత్తమామలు. అయితే, ఇంటికి వచ్చినప్పటి నుంచి అల్లుడి, కూర్చుని తింటూ.. ఏదో ఒకటి కావాలని వేధిస్తుండేవాడు. కూతురు మోహం చూసి అత్తమామలు ఏమనే వారు కాదు. ఈ క్రమంలో.. మామ..కొన్ని మేకలను విక్రయించాడు. ఇది అల్లుడికి తెలిసింది. తనకు డబ్బులను ఇవ్వాలని మామను వేధించాడు.

భార్యతో గొడవ పడ్డాడు. అల్లుడు నర్మూ సీతాయాదవ్.. ఆదివారం రాత్రి.. ఇంట్లో గొడవకు దిగాడు. తన పేరు మీద ఇంటిని రాసివ్వాలని (Dowry harassment) డిమాండ్ చేశాడు. దీంతో అత్తమామలు ప్రతిఘటించారు. దీంతొ అతను కోపంలో అక్కడ ఉన్న గొడ్డలి పట్టుకుని, అత్తమామలపై దాడిచేశాడు. వారిని ఇష్టమోచ్చినట్లు పొడిచాడు. దీంతో వారు అక్కడే కుప్పకూలి పడిపోయారు. అడ్డొచ్చిన భార్యపై కూడా దాడిచేశాడు. ఆ తర్వాత.. అక్కడినుంచి పారిపోయాడు. వీరి అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. అత్తమామలను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు చనిపోయారు. కూతురుని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Crime news, Dowry harassment, Family dispute, Maharashtra, Nagpur

ఉత్తమ కథలు