కోడిగుడ్డు కూర చేయలేదని.. ఫ్రెండ్ పై దారుణానికి ఒడిగట్టిన కిరాతకుడు

ప్రతీకాత్మక చిత్రం

మహారాష్ట్ర లోని నాగపూర్ లో దారుణం జరిగింది. భోజనానికి పిలిచిన స్నేహితుడిపైనే దారుణానికి ఒడిగట్టాడో కిరాతకుడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

 • News18
 • Last Updated :
 • Share this:
  సమాజంలో నేర ప్రవృత్తి విశృంఖలతకు సజీవ సాక్ష్యం ఈ ఘటన. టిఫిన్ చేయించలేదని, పది రూపాయలు అప్పు ఇవ్వలేదని, సెల్ ఫోన్ అడిగితే ఇవ్వనన్నాడని.. ఇలా చిన్న చిన్న కారణాలకే సొంత వ్యక్తుల ప్రాణాలు తీస్తున్నారు. అవతల ఉన్న వ్యక్తి రక్త సంబంధీకులైనా సరే వారిని చంపడానికి వెనుకాడటం లేదు. రాత్రి పూట భోజనానికి పిలిచిన పాపానికి ఒక ఫ్రెండ్ ప్రాణాలు తీశాడో కిరాతకుడు. అది కూడా భోజనంలో కోడి గుడ్డు కూర వండలేదని.. వినడానికి ఆశ్యర్యంగా ఉన్నా ఇది నిజం. మహారాష్ట్రలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుుగలోకి వచ్చింది. దీని వివరాలు కింది విధంగా ఉన్నాయి.

  మహారాష్ట్రలోని నాగ పూర్ జిల్లా మంకాపూర్ క చెందిన బన్సారీ (40) తన స్నేహితుడు గౌరవ్ గైక్వాడ్ ను రాత్రి భోజనానికి ఆహ్వానించాడు. ఫ్రెండ్ వచ్చినందుకు గానూ బన్సారీ.. తాగడానికి మందు కూడా తీసుకొచ్చాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. కొంతసేపటి తర్వాత భోజనం చేద్దామని కూర్చున్నారు. కానీ భోజనానికి వచ్చిన వ్యక్తి తనకు కోడిగుడ్డు కూర కావాలని అడిగాడు.

  maharashtra, maharashtra crime news, egg, egg curry, bansari, nagpur crime news, mankapur, mankapur news
  ప్రతీకాత్మక చిత్రం


  ప్రస్తుతానికి ఇంట్లో అవి లేవని చెప్పినా వినకుండా గైక్వాడ్ వినలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. అంతే.. మాటా మాటా పెరిగి.. గైక్వాడ్ కోపంతో ఊగిపోయాడు. దీంతో భోజనం చేయడానికి వచ్చిన గైక్వాడ్.. అక్కడే ఉన్న ఒక ఇనుపరాడ్ తో బన్సారీ తలపై గట్టిగా బాదాడు. అంతే.. బన్సారీ తలకు భారీ గాయం. ఆ గదంతా రక్తం. అంతటితో ఊరుకుని స్నేహితుడి తలపై మరో రెండు దెబ్బలు వేసి... అతడిని కొట్టి చంపాడు.

  ఈ ఘటన నాగపూర్ లో కలకలం సృష్టించింది. మానవత్వానికే మాయని మచ్చగా నిలిచిన ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. శనివారం హంతకుడిని అరెస్టు చేశారు. కోడి గుడ్డు కూర వండలేదనే కోపంతో స్నేహితుడిని హత్య చేసిన గైక్వాడ్ కు కఠిన శిక్ష వేయాలని బన్సారీ కుటుంబసభ్యులు కోరుతున్నారు.
  Published by:Srinivas Munigala
  First published: