Birth Day: పుట్టిన రోజున తల్వార్ తో కేక్ కట్ చేసిన యువకుడు.. అరెస్టు చేసిన పోలీసులు

ఓ యువకుడు తన పుట్టిన రోజున పెద్ద తల్వార్ తో మేకలను, గొర్రెలను నరికినట్లుగా కేక్ ను నరికి ముక్కలు చేశాడు. దీంతో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వారు స్పందించారు. ఆ యువకుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

news18-telugu
Updated: October 23, 2020, 9:12 PM IST
Birth Day: పుట్టిన రోజున తల్వార్ తో కేక్ కట్ చేసిన యువకుడు.. అరెస్టు చేసిన పోలీసులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మనలో అనేక మంది పుట్టిన రోజును జరుపుకుంటూ ఉంటాం. స్థాయికి తగిన కేక్ కట్ చేసి ఆనందిస్తాం. అయితే నాగపూర్ కు చెందిన 19 ఏళ్ల వ్యక్తి ఇలానే సంబరాలు చేసుకుని అరెస్టయ్యాడు. అతను చేసిన తప్పు ఎంటి అంటే కేక్ కట్ చేయడమే. కేక్ కట్ చేస్తే అరెస్టు ఏంటి అని అనుకుంటున్నారా? అతను కేక్ కట్ చేసింది మన లాంటి ప్లాస్టిక్ లేదా చిన్న పాటి స్టీల్ కత్తి తో కాదు. ఏకంగా పెద్ద తల్వార్ తో మేకలను, గొర్రెలను నరికినట్లుగా కేక్ ను నరికి ముక్కలు చేశాడు. దీంతో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వారు స్పందించారు. ఆ యువకుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తల్వార్ ను సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగపూర్ కు చెందిన నిఖిల్ పటేల్ అనే వ్యక్తి ఈ నెల 21న పుట్టిన రోజును జరుపుకున్నాడు.



ఈ సందర్భంగా ఆ రోజు ఉదయం అతడు వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా నిఖిల్ ఫ్రెండ్స్ నాలుగు పెద్ద కేక్ లను తీసుకువచ్చారు. ఆ ఉత్సాహంలో నిఖిల్ పెద్ద తల్వార్ తో ఆ కేక్ ను ముక్కలు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో ఉంచడంతో వైరల్ గా మారాయి. ఆ ఫొటోలు పోలీసుల వరకు వెళ్లడంతో వారు స్పందించారు. క్రైం బ్రాంచ్ పోలీసులు నిఖిల్ నివాసంలో సోదాలు నిర్వహించి ఆ తల్వార్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఆయుధ చట్టంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

వాహనాలు, ఇతర వస్తువులు, బంగారం, డబ్బుల దొంగతానికి గురైన వార్తలు మనం నిత్యం వింటూనే ఉంటాం. ఆ మధ్య ఒకరు ఏకంగా హైదరాబాద్ నుంచి సీటీ బస్సును కూడా ఎత్తుకెళ్లారు. అయితే పూణే మహానగరంలో ఇటీవల ఓ విచిత్రమైన దొంగతనం జరిగింది. కొందరు దొంగలు ఏకంగా బస్టాప్ నే ఎత్తుకెళ్లడం స్థానికంగా సంచలనంగా మారింది. అది ఎత్తుకెళ్లింది ఎవరో గుర్తించడం స్థానిక పోలీసులు, అధికారులకు సవాల్ గా మారింది. నిజంగానే దొంగతనం చేశారా.. లేకుండా అక్కడ బస్టాప్ లేకుండా చేయాలని ఇలా చేశారా? అన్న విషయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Published by: Nikhil Kumar S
First published: October 23, 2020, 9:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading