Vijayawada Murder Case: చంపింది అతడే..!! దివ్య తేజస్విని మర్డర్ కేసును చేధించిన పోలీసులు

విజయవాడలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని మర్డర్ కేసును పోలీసులు చేధించారు. ఆమెను ప్రేమ పేరుతో వేధించిన వ్యక్తే.. దివ్యను కడతేర్చాడని పోలీసులు తేల్చారు.

news18
Updated: October 19, 2020, 1:08 PM IST
Vijayawada Murder Case: చంపింది అతడే..!! దివ్య తేజస్విని మర్డర్ కేసును చేధించిన పోలీసులు
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 19, 2020, 1:08 PM IST
  • Share this:
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన విజయవాడ బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసును పోలీసులు చేధించారు. దివ్య తేజస్వినిని హత్య చేసింది ఆమెను ప్రేమ పేరుతో వేధించిన వ్యక్తి నాగేంద్రేనని తేల్చారు. ఇద్దరం ప్రేమించుకున్నామని, మంగళగిరి చర్చిలో పెళ్లి కూడా చేసుకున్నామంటూ నాంగేంద్ర వైరల్ చేసిన ఫోటోలు మార్ఫింగ్ చేసినవని పోలీసులు స్పష్టం చేశారు. మర్డర్ జరిగిన రోజు నాగేంద్ర, మొదటి అంతస్తు గదిలో నిద్రిస్తున్న తేజస్విని రూములో చొరబడి గడియ పెట్టాడని దర్యాప్తులో వెల్లడైంది.  దివ్య తేజస్విని తల్లి వచ్చి ఎంత అరచినా గడియ తీయలేదని, నాగేంద్ర ముందుగా సిద్దం చేసుకున్న కత్తితో దివ్య తేజస్వినిని విచక్షణా రహితంగా పొడిచి తాను కూడా స్వల్పంగా గాయాలు చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. దీంతో విజయవాడ దివ్య తేజస్విని కేసు మిస్టరీ వీడింది. ఇప్పటికే ఈ కేసును దిశ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు.

పోలీసులను తప్పుదారి పట్టించిన ఫోటోలే హంతకుడిని పట్టించాయి. దివ్య తేజస్విని మొబైల్ ఫోన్ లో దొరికిన ఆడియో సంభాషణ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగించారు. ఆరు నెలలుగా నాగేంద్ర పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడని దివ్య తేజస్విని మాట్లాడిన మాటలు హంతకుడిని పట్టించాయి. దివ్యను మంగళగిరి చర్చిలో పెళ్లి చేసుకున్నానని నాగేంద్ర చెబుతున్న మాటలు అబద్దమని పోలీసులు తేల్చారు. అసలు వారి మధ్య ప్రేమ వ్యవహారం నడవలేదని తేలింది.

పెయింటర్ గా పనిచేస్తున్న నాగేంద్ర, ప్రేమ పేరుతో దివ్యను వేధించినట్టు తేలింది. దీంతో నాగేంద్ర మొబైల్ లో దొరికిన ఫోటోలను ఎనాలసిస్ చేసిన పోలీసులు ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసినవని సాంకేతిక ఆధారాలతో తేల్చారు. దీంతో హంతకుడు నాగేంద్రేనని తేలిపోయింది.

విజయవాడకు చెందిన దివ్యను నాగేంద్ర బాబు క్రూరంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈనెల 15న ఉదయం పది గంటల సమయంలో దివ్యను ఆమె తల్లి కుసుమ టిఫిన్ చేయమని లేపగా.. కాసేపటి తర్వాత వస్తానని చెప్పిన దివ్య నిద్రలోకి వెళ్లింది. తర్వాత కొద్దిసేపటికి అనుమానం వచ్చిన ఆమె తల్లి.. దివ్య గదిలోకి వెళ్లి చూడగా.. ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. ఈ ఘటనలో దివ్యను చంపిన నాగేంద్ర కూడా కత్తితో గాయాలు చేసుకున్నాడు. ఈ హత్య జరిగిన తర్వాత బాధిత కుటుంబసభ్యుల బాధలు మిన్నంటాయి. హంతకుడిని ఎన్ కౌంటర్ చేయాలని ఆమె తండ్రి జోసెఫ్ డిమాండ్ చేశారు. దివ్యను పథకం ప్రకారం హత్య చేశాడని ఆయన ఆరోపించారు.
Published by: Srinivas Munigala
First published: October 19, 2020, 1:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading