నిన్న తండ్రి.. నేడు తల్లి ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడటంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. కోవిడ్ వల్ల ఏడాదిగా ఉద్యోగం లేక.. ఆర్థిక సమస్యలు పెరగడంతో నిన్న తండ్రి ఆత్మహత్య చేసుకోగా.. ఈ బాధ నుంచి కోలుకోక ముందే తల్లి కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. తల్లిదండ్రులిద్దరిని కోల్పోయిన ఆ చిన్నారులను చూస్తే ప్రతి ఒక్కరి హృదయం కలచివేస్తోంది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికకు రాజకీయ పార్టీల నేతలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రైవేటు టీచర్ రవి ఆర్ధిక కష్టాలు భరించలేక ఆత్మహత్యకు పాల్పడగా ఆ మరణానాన్ని తట్టుకోలేక భార్య అక్కమ్మ కూడా నాగార్జునసాగర్ కుడి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కరోనా మహమ్మారి కారణంగా ఏడాది కాలంగా ప్రైవేట్ టీచర్లు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఉపాధి కోల్పోయి చాలా మంది రోడ్డునపడిన విషయం కళ్లారా చూశాం.
తమ బతుకు బండి లాగడానికి చాలా మంది కూరగాయలు, పండ్లు అమ్ముకుని భార్యా పిల్లలను పోషించుకుంటుంటే.. మరికొందరు కూలీలుగా, తాపీ మేస్త్రీలుగా.. చిల్లర వర్తకులుగా మారి ఆ రోజుకు ఇంటిని గట్టెక్కితే చాలు అనుకొని బతికారు. ఇలా దినదనగండం నూరేళ్ల ఆయుషులాగా తమ జీవన విధానం మారింది. త్వరలోనే తమ కష్టాలు పోతాయనుకున్న సమయంలోనే ఈ మహమ్మారి రూటు మార్చింది. సెకండ్ వేవ్ తో బక్క జనాలపై విరుచుకుపడుతోంది. దీంతో పాఠశాలలను తెరిచినట్లే తెరిచి మరల మూసి వేశారు. ఏడాది కాలంగా రావాల్సిన జీతాలు రాక చాలామంది ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్నారు. ఎంతో మంది ఆత్మహ్యతకు పాల్పడిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
తాజాగా కరోనా కష్టాలు భరించలేక ప్రైవేటు టీచర్ , అతని భార్య కూడా ఆత్మహత్య చేసుకోవడంతో తన పిల్లలు అనాథలుగా మారారు. ఆ పిల్లల రోధన విన్న ప్రతి ఒక్కరు అయ్యే పాపం అంటున్నారు. ఆర్ధిక ఇబ్బందులు భరించలేక ఉక్కిరిబిక్కిరవుతూ అర్ధాకలితో అలమటిస్తుంటే ఈ కష్టాలు తాను భరించలేనంటూ కట్టుకున్న భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా అతని భార్య కూడా ఆత్మహత్య చేసుకుంది. నాగార్జునసాగర్ లోని హిల్ కాలనీలో జరిగిన ఈ ఘటన అందరినీ విషాదంలోకి నెట్టింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Crime, Crime news, Nagarjuna sagar, Nagarjuna Sagar By-election, Private teacher suicide, Telangana News, Wife suicide