హోమ్ /వార్తలు /క్రైమ్ /

మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా గెలవలేని దద్దమ్మ.. ఎమ్మెల్యే రోజా ఘాటు వ్యాఖ్యలు..

మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా గెలవలేని దద్దమ్మ.. ఎమ్మెల్యే రోజా ఘాటు వ్యాఖ్యలు..

జబర్దస్త్‌లో నటించడం తమ నాయకుడికి తెలుసని.. తాను పూర్తిస్థాయి రాజకీయ నాయకురాలిగా మారితే అవన్నీ వదిలేస్తానని చెప్పింది. జబర్దస్త్ వల్ల తనకు ఉండే క్రేజ్ అలా కంటిన్యూ అవుతుందనే బాధతో మాట్లాడుతున్నారని.. అది మంచి కామెడీ షో మాత్రమే అని దాని వల్ల చాలా మంది ఆరోగ్యం కూడా బాగు పడుతుందని చెప్పుకొచ్చింది రోజా.

లోకేష్ ఇంటిలో తిని కూర్చొని ఇష్టారాజ్యంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం చాలా బాధాకరమన్నారు. విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన తండ్రి, కొడుకులు ఇద్దరు దొంగల్లాగా పారిపోయి హైదరాబాద్‌లో తలదాచుకున్నారని విమర్శించారు.

ఇంకా చదవండి ...

  నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.. నారా లోకేశ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ముఖ్యమంత్రి కొడుకు, రాష్ట్ర మంత్రిగా ఉండి.. ఎమ్మెల్యేగా గెలవలేని దద్దమ్మ అంటూ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న రోజా అనంతరం మీడియాతో మాట్లాడారు. లోకేష్ ఇంటిలో తిని కూర్చొని ఇష్టారాజ్యంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం చాలా బాధాకరమన్నారు. విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన తండ్రి, కొడుకులు ఇద్దరు దొంగల్లాగా పారిపోయి హైదరాబాద్‌లో తలదాచుకున్నారని విమర్శించారు. పార్టీలో ఉన్న అవినీతి గద్దల కోసం హైదరాబాద్ విడి ఏపీకి పరుగులు తీశారని, చంద్రబాబుకి, లోకేష్‌కి కేవలం అధికారం, డబ్బు మాత్రమే కావాలని, ప్రజలపై ఏమాత్రం అభిమానం లేదని ఆరోపించారు.

  పనిపాటా లేకుండా ఇంట్లో కూర్చొని లోకేష్ పబ్జి గేమ్ ఆడుతుంటాడని, జగన్ అలా కాదని గుర్తు చేశారు. 151 సీట్లతో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన జగన్ గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు లేదని పేర్కొన్నారు. సంవత్సర పరిపాలనలోనే సీఎం జగన్ తాను ఇచ్చిన హామీలు దాదాపు 100 శాతం పూర్తి చేశారని చెప్పారు. కరోనా కట్టడి కోసం ఎక్కువ మందికి టెస్టులు చేసి కరోనా నియంత్రణలో ముందున్న రాష్ట్రం ఏపీగా అని, ఏ రాష్ట్రంలో లేని విధంగా కరోనా టెస్టులు, ట్రీట్మెంట్ ఉచితంగా సీఎం జగన్ అందిస్తున్నారని గుర్తు చేశారు.

  3లక్షల కోట్లు అప్పు చంద్రబాబు ఇచ్చినా.. సీఎం జగన్ సమర్ధవంతంగా పరిపాలన చేస్తున్నారని కొనియాడారు. అమ్మఒడి, కాపు నేస్తం, రైతు భరోసా, మహిళలకు సున్నా వడ్డీ రుణాలతో ప్రతి వర్గానికి, కులానికి చేయూత ఇస్తున్నారని రోజా ప్రశంసించారు.

  Published by:Anil
  First published:

  Tags: Andhra Pradesh, MLA Roja, Nara Lokesh

  ఉత్తమ కథలు