• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • NAGARAJU A GUINNESS RECORD HOLDER IN CRICKET FROM VIJAYAWADA BEHIND BARS FOR DUPING MSK PRASAD NK

గిన్నీస్‌బుక్ ఎక్కిన క్రికెటర్ అరెస్ట్... ట్రూకాలర్ యాప్‌తో లక్షలు కాజేస్తూ...

ప్రతీకాత్మక చిత్రం

Vijayawada : బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్ ఇచ్చిన కంప్లైంట్‌తో మాచవరం పోలీసులు గన్నవరం ఎయిర్‌పోర్ట్ దగ్గర నాగరాజును అరెస్టు చేశారు. అతని నుంచీ రూ.1.8 లక్షలు, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు.

  • Share this:
ఉన్నత ఆశయం ఉంటే చాలదు... దాన్ని సాధించే మార్గం కూడా ఉన్నతంగానే ఉండాలన్నది గాంధీజీ మాట. శ్రీకాకుళం జిల్లా... పోలాకి మండలంలోని ఎవ్వారి పేటకు చెందిన బి.నాగరాజు... విశాఖపట్నంలోని మధురవాడలో ఉంటున్నాడు. MBA పూర్తి చేసిన అతను, క్రికెటర్ అవ్వాలని కలలుకన్నాడు. సౌత్ జోన్ (2011), సెంట్రల్ జోన్ (2013) సహా చాలా లెవెల్స్‌లో పాల్గొన్నాడు. 2014లో స్టేట్ రంజీ ట్రోఫీలో ఆడిన నాగరాజు... ఆపకుండా 82 గంటలు ఆడి... గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. దాంతో అతనికి చాలా స్పాన్సర్‌షిప్‌లు దక్కాయి. ఇక్కడే నాగరాజు ఓ తప్పు చేశాడు. లగ్జరీ జీవితాన్ని అనుభవించాలనే ఉద్దేశంతో... డబ్బు కోసం జనాన్ని మోసం చెయ్యాలని డిసైడయ్యాడు.

జార్ఖండ్ డైనమైట్... MS ధోనీ పేరు మీద ఓ క్రికెట్ అకాడెమీ ఏర్పాటు చేయబోతున్నానంటూ ఎన్.వేణుగోపాల్ దగ్గర రూ.22,300 తీసుకున్నాడు నాగరాజు. తాను మోసపోయానని గుర్తించిన వేణుగోపాల్... నాగరాజుపై విశాఖ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. ఫలితంగా నాగరాజు అరెస్టయ్యాడు.

మరో సందర్భంలో... మంత్రి గంటా శ్రీనివాసరావుకి పర్సనల్ అసిస్టెంట్‌ని అని చెప్పుకుంటూ... కేర్ హాస్పిటల్స్ దగ్గర రూ.60 లక్షలు తీసుకోవడంతో... ఆ కేసులో కూడా అదే విశాఖ త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక 2019లో టీ 20 టికెట్లు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి నుంచీ రూ.20 వేలు తీసుకున్నాడు నాగరాజు. విశాఖలోని పీఎం పాలెం పోలీసులు నాగరాజును అరెస్టు చేశారు.

ప్రతిసారీ బెయిల్‌పై బయటికొస్తున్న నాగరాజు... తాజాగా ఓ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వేడుకలో MSK ప్రసాద్‌ని కలిశాడు. అక్కడ ఆయన వాయిస్ దాదాపు తన వాయిస్‌లాగే ఉండటాన్ని గమనించాడు. బాగా ప్రాక్టీస్ చేశాడు. అచ్చం అలాగే మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు. నెక్ట్స్ ట్రూ కాలర్ యాప్‌లో తన పేరును MSK ప్రసాద్ అని రాసుకున్నాడు. చాలా మంది పారిశ్రామిక వేత్తలకు కాల్స్ చేసి... డబ్బులు గుంజాడు.


ఈమధ్య హైదరాబాద్‌కి చెందిన ఓ మొబైల్ స్టోర్ ఎండీ మురళీకి కాల్ చేసి... IPL 12 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కి ప్రాతినిధ్యం కల్పిస్తానంటూ రూ.2.88 లక్షలు కాజేశాడు. అలాగే విజయవాడలో రామకృష్ణ హౌసింగ్ సొసైటీకి చెందిన వ్యాపారి రామకృష్ణ దగ్గర రూ.3.8 లక్షలు తీసుకున్నాడు. ఇప్పుడీ అన్ని కేసుల్లో నాగరాజు బుక్కయ్యాడు. క్రికెటర్‌గా నిజాయితీగా కష్టపడి ఉంటే... మెన్ ఇన్ బ్లూలో చేరేవాడేమో... అడ్డదారులు తొక్కి... జైలు గోడలకు పరిమితం అవుతున్నాడు.

 

ఇవి కూడా చదవండి :

ఎయిర్‌హోస్టెస్‌ చేతులు తడుముతూ వెధవ్వేషాలు... బుక్కైన హైదరాబాద్ వ్యాపారి

Cyclone Fani : రేపు సాయంత్రం వరకూ ఫొణి తుఫాను ప్రభావం... నాగాలాండ్, మణిపూర్‌కీ పొంచివున్న ముప్పు...

Cyclone Fani : పూరీపై విరుచుకుపడిన ఫొణి తుఫాను... సహాయక చర్యల్లో NDRF...


సీసీ కెమెరాను కొట్టేసి... మరో సీసీ కెమెరాకు దొరికిన దొంగ...
First published: