రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ ఎమ్మార్వో..

నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం డిప్యూటీ తహసీల్దార్ జయలక్ష్మి రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడింది.

news18-telugu
Updated: February 25, 2020, 2:54 PM IST
రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ ఎమ్మార్వో..
డిప్యూటీ ఎమ్మార్వో జయలక్ష్మి
  • Share this:
నాగర్ కర్నూల్ జిల్లాలో రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిందో డిప్యూటీ ఎమ్మార్వో. తాడూరు మండలం డిప్యూటీ తహసీల్దార్ జయలక్ష్మి.. జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో సీ బ్లాక్‌లో ఇంచార్జ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తోంది. తిమ్మాజీపేట మండలం మారేపల్లి గ్రామంలో ఓ వివాదంలో ఉన్న భూమి విషయంలో వెంకటయ్య అనే వ్యక్తి నుంచి పట్టా మార్పిడి కోసం రూ.13 లక్షలు డిమాండ్ చేశారు. బతిమిలాడగా చివరకు రూ.10 లక్షలు ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు. దీంతో వెంకటయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో.. కలెక్టరేట్ కార్యాలయంలో వెంకటయ్య వద్ద ఆమె లంచం తీసుకంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జయలక్ష్మి నివసించే మహబూబ్‌నగర్‌లోని ఇంట్లో కూడా సోదాలు చేసేందుకు నిజామాబాద్‌ ఏసీబీ ఎస్సై శివకుమార్‌ వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్‌ చేస్తే 1064 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ అధికారులు సూచించారు.


First published: February 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు