Nagin Dance: నాగిన్ పాటను పెట్టి.. పాముతో నృత్యం చేయించారు. కాసేపు అటూ ఇటూ ఊగుతూ డాన్స్ చేసిన పాము.. ఆ తర్వాత భయపడిపోయింది. తన చుట్టే ఏం జరుగుతుందో దానికి అర్ధం కాలేదు.
పెళ్లి బరాత్ అంటేనే రచ్చ రచ్చ. వధూవరుల ఊరేగింపు వేళ సందడి మామూలుగా ఉండదు. డీజే పాటల హోరులో బంధుమిత్రులు డాన్స్‌లతో ఇరగదీస్తారు. డప్పుల దరువుకు స్పెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తారు. సాధారణంగా పెళ్లి బరాత్‌లో నాగిన్ డాన్స్‌లు వేయడం చూస్తుటాం. కానీ ఓ పెళ్లి వేడుకలో నిజంగానే నాగుపాము డాన్స్ చేసింది. నాగిన్.. నాగిన్ పాటలకు స్పెప్పులేసింది. ఒడిశాలో ఈ ఘటన జరిగింది. మరి నాగుపాము ఎక్కడి నుంచి వచ్చింది? నాగిన్ పాట వినే బరాత్‌లోకి వచ్చిందా? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా కరంజియా పట్టణానికి చెందిన ఓ యువకుడికి ఇటీవల పెళ్లి జరిగింది. వివాహం అనంతరం వధూవరులను ఊరేగింపుగా వరుడి ఇంటికి తీసుకెళ్లారు. ఐతే బరాత్‌లో 'మై నాగిన్.. నాగిన్' పాటకు నాగుపాము నృత్యం చేస్తూ కనిపించింది. సినిమాల్లో చూపించినట్లుగానే ఊగిపోయింది. నిజానికి డీజీ పాటలు విని నాగుపాము అక్కడకు రాలేదు. నిర్వాహకులే నాగు పామును అద్దెకు తీసుకొచ్చారు. నాగిన్ పాటలను పెట్టి.. నాగు పాముతో డాన్స్‌లు చేయించారు. స్థానికంగా పాములను ఆడించే ఓ వ్యక్తి నుంచి బుట్టలో పామును తీసుకొచ్చారు. అనంతరం బరాత్ జరుగుతున్న చోటుకు వెళ్లి.. రోడ్డుపై బుట్టను ఓపెన్ చేశారు. నాగిన్ పాటను పెట్టి.. దానితో నృత్యం చేయించారు. కాసేపు అటూ ఇటూ ఊగుతూ డాన్స్ చేసిన పాము.. ఆ తర్వాత భయపడిపోయింది. తన చుట్టే ఏం జరుగుతుందో దానికి అర్ధం కాలేదు. కానీ పాములను ఆడించే వ్యక్తి మాత్రం.. బుట్టలో అటూ ఇటూ తిప్పుతూ..ఉత్సాహంగా డాన్స్ చేశాడు. పామును చూసి కొందరు స్థానికులు భయడిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నాగుపామును రక్షించారు.
One person was arrested with a live cobra snake to the song '#Main_Nagin....' at a procession in Odisha's #Mayurbhanj district. #Karanjia town on Wednesday night dancing with a bamboo basket of snake charmers whose lid is open from which the snake is visible. @IamNaveenKapoorpic.twitter.com/CHK9NTPZO4
పామును అద్దెకు ఇచ్చిన వ్యక్తితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితలపై విచారణ కొనసాగుతోందని.. వన్యప్రాణి సంరక్ష చట్టం-1982 కింద వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పామును అక్కడి నుంచి తీసుకెళ్లి.. అడవిలో విడిచిపెట్టారు. ఊరేగింపులో పెద్ద పెద్ద శబ్ధాలతో పాటు పెట్టడంతో పాము భయపడిపోయిందని స్నేక్ హెల్ప్ లైన్ కోఆర్డినేరట్ సువేందు మాలిక్ తెలిపారు. ఇలాంటి హేయమైన చర్యలు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నాగిన్ డాన్స్‌ని ప్రోత్సహించిన వరుడు, అతడి తండ్రికి కూడా శిక్షించాలని కోరారు. దేశంలో ఇలాంటి ఘటన జరిగి ఉండదని.. ఇదే తొలి కేసు అయి ఉంటుందని సువేంద్ మాలిక్ అభిప్రాయపడ్డారు. వన్య ప్రాణుల పట్ల ఇలాంటి ఘటనలు జరగకుండా.. కఠిన చట్టాలు తేవాలని ఆయన కోరారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.