హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking : ఎప్పుడూ ఫోన్ కాల్స్ లోనే..ఓ అర్థరాత్రి భార్యను అలా చూసిన భర్త..చివరికి

Shocking : ఎప్పుడూ ఫోన్ కాల్స్ లోనే..ఓ అర్థరాత్రి భార్యను అలా చూసిన భర్త..చివరికి

భార్యను చంపిన భర్త

భార్యను చంపిన భర్త

Extramarital Affair : కావేరిపుర గ్రామానికి చెందిన అశోక్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య వనజాక్షి(31)స్థానికంగా ఉండే ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండేది. వీరికి 15 ఏళ్ల క్రితం వివాహమై..ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Extramarital Affair : భార్య మ‌రొక‌రితో వివాహేత‌ర సంబంధం(Extramarital Affair) కొన‌సాగిస్తోంద‌నే అనుమానంతో ఆమె గొంతుకోసి క‌డ‌తేర్చాడు భ‌ర్త. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది. నిందితుడిని క్యాబ్ డ్రైవర్ గా ప‌నిచేసే అశోక్ గా గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భార్యను హత్య చేసినట్లు అశోక్ ఒప్పుకున్నాడు.

మైసూర్(Mysuru) జిల్లాలోని కావేరిపుర గ్రామానికి చెందిన అశోక్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య వనజాక్షి(31)స్థానికంగా ఉండే ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండేది. వీరికి 15 ఏళ్ల క్రితం వివాహమై..ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఇంట్లో ఉన్న సమయంలో వనజాక్షి ఎప్పుడూ మొబైల్ ఫోన్ లోనే కాలం గడుపుతుండేది. ఎప్పుడూ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుండటాన్ని పలుసార్లు భర్త గమనించాడు. ఈ విషయమై పలుమార్లు భార్యని వారించాడు. ఎవరితో మాట్లాడుతున్నావ్ ఇంతసేపు..ఏం మాట్లాడుతున్నావ్ అంటూ భార్యను పలుస్లారు హెచ్చరించాడు. అయినా వనజాక్షి మారలేదు. భర్త హెచ్చరికల్ని పట్టించుకోకుండా మళ్లీ ఫోన్ లో వేరేవాళ్లతో మాట్లాడటం కొనసాగించింది.

ALSO READ Shocking : గిన్నెలు కడగలేదని.. రూమ్ మేట్ ని కత్తితో కోసి చంపేశాడు

అయితే తన భార్య.. మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందేమోనని అశోక్ కు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో గత ఆదివారం రాత్రి కూడా భార్య ఫోన్ లో మాట్లాడుతుండటాన్ని గమనించిన అశోక్.. ఇదే విషయమై భార్యను నిలదీశాడు. భర్త మాటలను భార్య పట్టించుకోలేదు. దీంతో భార్యను చెంపదెబ్బ కొట్టాడు అశోక్. దీంతో ఆగ్రహించిన భార్య..వెంటనే వంటగదిలోకి వెళ్లి ఓ కర్ర తీసుకొచ్చి భర్తను కొట్టేందుకు ప్రయత్నించింది. భార్య చేతిలోని కర్రను లాక్కున్న భర్త..భార్యను మరోసారి లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టాడు. దీంతో వనజాక్షి కిందపడిపోయింది. దీంతో వెంటనే భార్య గొంతుకోసి అక్కడి నుంచి పరారయ్యాడు అశోక్. అయితే ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత తన సోదరిని చూసేందుకని వనజాక్షి తమ్ముడు ఆ ఇంటికి వచ్చాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అతడు పోలీసులకు కంప్లెయింట్ చేయగా..వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అశోక్ ని పట్టుకుని విచారించగా..భార్యను హత్య చేసినట్లు అశోక్ అంగీకరించాడని పోీసులు తెలిపారు.

First published:

Tags: Crime news, Extra marital affair, Karnataka

ఉత్తమ కథలు