హోమ్ /వార్తలు /క్రైమ్ /

Gang rape : MBA విద్యార్థిని రేప్‌ కేసులో 5గురు అరెస్ట్..అందులో ఒకరు మైనర్.. ఎన్‌కౌంటర్ చేయాలన్న సీఎం

Gang rape : MBA విద్యార్థిని రేప్‌ కేసులో 5గురు అరెస్ట్..అందులో ఒకరు మైనర్.. ఎన్‌కౌంటర్ చేయాలన్న సీఎం

Gang rape

Gang rape

Gang Rape : మైసూర్‌లో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన అయిదుగురు దుండగులను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. మరోకరి కోసం పోలీసులు వెతుకుతుండగా అరెస్ట్ అయిన వారిలో ఒక మైనర్ కూడా ఉన్నట్టు సమాచారం.

  ఎట్టకేలకు మైసూర్ (Mysuru)యూనివర్శిటి విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఆరుగురు యువకులు బెదిరింపులతో పాటు గ్యాంగ్ రేప్‌కు (gang rape ) పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. నిందితుల్లో అయిుదుగురిని అరెస్ట్ (arrest )చేయగా మరోకరి కోసం వెతుకున్నట్టు తెలిపారు. ఇక అరెస్టయిన అయిదుగురు యువకుల్లో ఒకరు మైనర్ కూడా ఉన్నట్టు చెబుతున్నారు. అత్యాచారానికి పాల్పడిన వారు తమిళనాడుకు(Tamilnadu) రాష్ట్రంలోని తిరుపూర్ జిల్లాకు చెందిన లేబర్‌గా గుర్తించినట్టు కర్ణాటక (Karnataka) డీజీపి ప్రవీణ్ సూద్ శనివారం తెలిపారు.

  మహారాష్ట్రకు (Maharashtra ) చెందిన ఓ విద్యార్థిని మైసూర్ యూనివర్శిటిలో ఎంబీఏ(MBA) చేస్తుంది. గత మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు ఆమె స్నేహితుడితో కలిసి ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మైసూర్ హిల్స్ వద్దకు వెళ్లిన నేపథ్యంలోనే వారిని వెంబడించిన దుండగులు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో వారిని అటాక్ చేశారు. ఇద్దరిని బాగా కొట్టి డబ్బులు కూడా డిమాండ్ చేశారు. అందులో ఇద్దరు ఆమెపై అత్యాచారం (rape)కూడా చేసినట్టు తెలుస్తోంది. దీంతో వారు సంఘటన జరిగిన ఆరు గంటల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు రంగంలోకి దిగారు. విద్యార్థిని (student) అత్యాచారం చేసిన అనంతంర వారికే ఫోన్ చేసిన నిందితులు మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. లేదంటే తమ వద్ద ఉన్న వీడియోను సోషల్ మీడియాలో(socila media) అప్‌‌లోడ్ చేస్తామంటూ హెచ్చరించారు. ఇక పోలీసులకు చెప్పినా కేసు నమోదు చేసినా వీడియోను బయటపెడతామని హెచ్చరించారు.

  ఇది చదవండి : యువతిని రేప్ చేసిన వారే డబ్బులు డిమాండ్.. ఆ తర్వాత వీడియోను సైతం..!


  దీంతో అత్యాచార ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. నిందితులు కరుడుగట్టిన వారుగా ముందుగా అంచనా వేశారు. అందరు 25 నుండి 30 సంవత్సరాల వయస్సున్న వారిగా పోలీసులు గుర్తించారు. ఈనేపథ్యంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. ఇలాంటీ నిందితులను హైదరాబాద్ దిశ అత్యాచారం తరహాలో ఎన్ కౌంటర్ చేయాలని అన్నారు. అప్పుడే రాష్ట్రంలో ఇలాంటీ అత్యాచారాలు చేసేందుకు వెనకడుగు వేస్తారని అన్నారు.

  ఇది చదవండి : అత్తగారు మందలించారని ఘాతుకం.. ముగ్గురు పిల్లలతో పాటు తల్లిని సైతం గోంతులు కోసి...!


  దీంతో పోలీసులు మూడు రోజుల పాటు నగరాన్ని జల్లెడపట్టి ఎట్టకేలకు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కాగా మరోమైపు అత్యాచారానికి గురైన విద్యార్థిని ఇంకా షాక్ నుండి కోలుకోలేని పరిస్థితిలో ఉందని పోలీసులు చెబతున్నారు. దీంతో ఆమె కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు సేకరిస్తామని చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రతి రాష్ట్రంలో ఇలాంటీ గ్యాంగ్ రేప్‌లు నిరంతరం జరగుతూనే ఉన్నాయి.. ఒంటరిగా ఉన్న మహిళలతో పాటు ఇలా జంటలుగా వెళ్లిన మహిళలపై దుండగులు వెంబడించి అత్యాచారం చేస్తుండడంతో ప్రభుత్వ సెక్యూరిటీపై ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు చెలరేగుతున్నాయి.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Karnataka

  ఉత్తమ కథలు