MYSTERY REVEALED IN YOUNG BUSINESSMAN KARANAM RAHUL MURDER CASE AS MASTER MIND KOGANTI IN POLICE CUSTODY NGS
Rahul Murder: రాహుల్ హత్య కేసులో సంచలన విషయాలు.. మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు చెప్పిన కోగంటి
రాహుల్, కోగంటి సత్యం (ఫైల్)
Rahul Murder Report: విజయవాడలో వ్యాపారి రాహుల్ హత్య కేసు మిస్టరీ వీడుతోంది..? ఈ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కంపెనీలో షేర్ల వివాదమే.. రాహుల్ హత్య కారణమంటున్నారు. పోలీసులు. అయితే పోలీసుల విచారణలో కోగంటి సత్యం సంచలన విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది.
Rahul Murder Remand Report: ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)లో వ్యాపారి రాహుల్ (Businessman Rahul)హత్య కేసు పెను సంచలనంగా మారింది. ఇప్పుడిప్పుడే ఈ హత్య కేసు మిస్టరీ వీడే దిశగా అడుగులు వేస్తోంది. కంపెనీలో షేర్ల వివాదమే.. రాహుల్ హత్య కారణమని పోలీసులు భావిస్తున్నారు. అలాగే హత్య జరిగిన తరువాత కోరాడ విజయ్ (korada vijay)కు ఆయన బంధువుల ఆశ్రయం ఇచ్చినట్టు తెలుస్తోంది. రాహుల్ ఫోన్లు కొరడా విజయ్ దగ్గర ఉండడం పోలీసులు గుర్తించారు. కోరాడ విజయ్‌కుమార్‌తో పాటు కారుడ్రైవర్ పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు రాహుల్ హత్య (Rahul Murder Case) కేసులో మొదట్నుంచీ కోగంటి సత్యం పేరు ప్రధానంగా వినిపించింది. రాహుల్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదులోనూ కోగంటి పేరును చేర్చారు విజయవాడ(Vijayawada) పోలీసులు. రాహుల్ మర్డర్ కు ప్లాన్ వేసింది. దాన్ని అమలు చేసింది కోగంటేనన్న విషయం తీవ్ర సంచలనంగా మారింది. అసలు, రాహుల్ కంపెనీలోనే లేని కోగంటి ఎందుకు ఇన్వాల్స్ అయ్యాడనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు మైండ్ బ్లాకయ్యే నిజాలు తెలిశాయని సమాచారం. అసలు కుట్రదారుడే కోగంటిగా గుర్తించి అతని కోసం వేట మొదలుపెట్టారు. అయితే, అప్పటివరకు బెజవాడలోనే ఉన్న కోగంటి… ఎప్పుడైతే పోలీసులు తన కోసం వస్తున్నారని తెలుసుకున్నాడో పారిపోయేందుకు ప్రయత్నించాడు.
ఈనెల 19న రాహుల్ మర్డర్ జరిగితే, 22వరకు బెజవాడలోనే కోగంటి ఉన్నాడు. అంటే నాలుగు రోజులపాటు ఇంట్లోనే ఉంటూ తన కార్యకలాపాలు కొనసాగించాడు. ఎప్పుడైతే పోలీసులు తన కోసం వస్తున్నారని తెలుసుకున్నాడో ఈనెల 23న బెంగళూరు పరారయ్యాడు. అక్కడ్నుంచి విదేశాలకు చెక్కేయాలని ప్లాన్ వేసుకున్నాడు. కానీ, బెజవాడ పోలీసులు… కోగంటి కంటే వేగంగా స్కెచ్ వేశారు. ఈమెయిల్ ద్వారా బెంగళూరు ఎయిర్ పోర్ట్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దొరికిపోయాడు. బెంగళూరు ఎయిర్ పోర్టులో అక్కడి పోలీసులు కోగంటిని అరెస్ట్ చేశారు. అక్కడ్నుంచి ట్రాన్సిట్ వారెంట్ పై కోగంటిని విజయవాడ తరలించిన ఏపీ పోలీసులు.. కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కి తరలించారు. రాహుల్ ను ఎలా హతమార్చాలి. ఎవరిని రంగంలోకి దించాలి. హత్య తర్వాత ఎలా వ్యవహరించాలి.. పోలీసులకు అనుమానం రాకుండా ఎలా ఉండాలనేదానిపై కోగంటి సత్యం నిందితులకు ట్రైనింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. హత్య తర్వాత పేరు బయటకు వస్తే ఎలా లొంగిపోవాలనేది కూడా కోరాడ విజయ్ కుమార్ కు కోగంటి సత్యమే చెప్పినట్లు గుర్తించారు. కోగంటి సత్యం 2019లో హైదరాబాద్ పంజాగుట్టలో జరిగిన స్టీల్ వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే..
రాహుల్ హత్య తర్వాత కోగంటి పేరు బయటకు రావడంతో అతన్ని మీడియా సంప్రదించింది. ఐతే హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఎవరో అనవసరంగా తనపేరు బయటకు తెచ్చారని సత్యం బుకాయించారు. కానీ అతడే హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. కోగంటి సత్యంను బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి విజయవాడ తరలించారు.
కోగంటి సత్యం రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించారు పోలీసులు, రిమాండ్ రిపోర్ట్ లో కోగంటి పాత్రను క్లియర్ గా ప్రస్తావించారు పోలీసులు. రాహుల్ మర్డర్ కేసులో కోగంటిని ఏ4గా చేర్చిన పోలీసులు.. ప్రధాన నిందితుడు ఏ1 కోరాడ విజయ్ తో కలిసి రాహుల్ మర్డర్ కు కుట్ర పన్నినట్లు తెలిపారు. కాగా, ఇప్పటికే కోగంటి సత్యంపై మొత్తం 24 క్రిమినల్ కేసులు ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ హత్య కేసుకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే మీడియాకు పోలీసులు వివరించేందుకు సిద్ధమవుతున్నారు..
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.