చిన్న వయసులోనే ఎలాంటి భయ భక్తులు లేకుండా కామ క్రోధ మదమాశ్చర్యాలతో కొట్టుమిట్టాడుతూ కన్నూ మిన్నూ కానకుండా ప్రేమ పేరిట సాగించిన కామ క్రీడలో మూడు జీవితాలు బలయ్యాయి. అవును ఇది నిజం. యువతీ యువకులు ప్రేమ పేరిట సాగించిన దారుణ మారుణకాండను షాద్ నగర్ ప్రజలు నేటికి ఎవరూ మరిచిపోలేదు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ ప్రాంతంలో గల గుండుగేరిలో 2018లో జరిగిన ఒక యువకుడి హత్య ఉదంతంలో ఇద్దరు యువతీ యువకులకు యావజ్జీవ కారాగార శిక్ష పడటం సంచలనం రేపింది. ఇంకా జీవితాన్ని మొదలు చవిచూడని యువతీ యువకులు ఇప్పుడు జీవితాంతం కటకటాల పాలై ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అసలేం జరిగింది...?
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ గుండుగెరి ప్రాంతానికి చెందిన పర్వీన్ అనే యువతి శేఖర్ అనే యువకుడితో ప్రేమ కలాపాలు సాగించింది. అంతేకాదు హైదరాబాద్ పహాడీ షరీఫ్ కు చెందిన మరో యువకుడు ఆసీస్ ఖురేషిని కూడా ప్రేమించింది. ఈ త్రికోణపు ప్రేమాయణంలో ఏం జరిగిందో తెలియదు గానీ ఇద్దరు కలిసి శేఖర్ అడ్డు తొలగించేందుకు దారుణమైన పథకాన్ని రచించారు. ఇంటికి పిలిచి మద్యం తాగించి క్రూరంగా కత్తులతో పొడిచి చంపారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అప్పటి ఏసీపీ వి. సురేందర్ నేతృత్వంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని పక్క సాక్ష్యాధారాలు సేకరించి చార్జిషీట్ దాఖలు చేశారు.

హత్యకు పాల్పడిన నేరస్తులు...
2018 సంవత్సరంలో అక్టోబర్ 20 వ తేదీన ఫరూఖ్ నగర్ ప్రాంతంలోని గుండుగేరిలో గల సలీం ఇంట్లో గుండుగేరికి చెందిన ఈరమోని శేఖర్ (24)ను పర్వీన్ బేగం, ఆసిఫ్ ఖురేషీ.. ఇద్దరు కలిసి ముందస్తు పధకంలో బాగంగా రాత్రి సమయంలో తన ఇంటిలో ఎవరు లేరు అని పర్వీన్ ఇంటికి పిలిపించుకొంది. అతనికి ముందుగా బాగా బీర్లు త్రాగించి ఆ తరువాత మరో ప్రియుడు ఆసీఫ్ తో కలిసి శేఖర్ తాగిన మైకంలో ఉండగా అతన్ని క్రూరంగా కత్తులతో పొడిచి చంపారు. ఈ కేసులో నిందితులు అయిన ఆసిఫ్ ఖురేషీ, పర్వీన బేగంలను ఇద్దరినీ 24వ తేదీ అక్టోబర్ 2018 రోజున శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి పర్యవేక్షణలో షాద్ నగర్ అప్పటి ఏసీపీ సురేందర్, ఇన్స్పెక్టర్ ఏ.శ్రీధర్ కుమార్ సిబ్బంది, ఎస్ఓటి శంషాబాద్ సహకారంతో వెంటనే ఎంతో చాక చక్యంగా పట్టుకొని, అరెస్టు చేసి జైలుకు పంపారు.
ఆ తరువాత ఈ హత్య కేసును క్షుణ్ణంగా ధర్యాప్తు చేసి, కేసుకు సంబందించి అన్ని సాక్ష్యాధారాలు సేకరించి, పై ఇరువురు నిందితుల మీద చార్జ్ షీట్ దాఖలు చేసినారు. ఈ కేసులో విచారణ జరిపిన మహబూబ్ నగర్ జిల్లా కోర్ట్.. అందరి సాక్షులను, ఇతర సంబందిత సాక్ష్యాలను విచారించింది. అనంతరం.. మంగళవారం ఇరువురు నిందితుల మీద నేరం రుజువు అయింది.
నిందితులు యం.డి. ఆసిఫ్ ఖురేషీ యం.డి. పర్వీన బేగమ్ ఇద్దరికీ యవజీవ కారాగార శిక్షతో పాటుగా, ఒక్కొక్కరికి రూ. 5 వేల జరిమానా కూడా విదించింది కోర్టు. ఈ కేసులో మృతుని తల్లిదండ్రులు, సోదరులు ఇతర సాక్షులు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా కోర్ట్ లో సాక్ష్యం చెప్పటం వల్లే నేరం రుజువై ఇద్దరికి యావజ్జీవ శిక్ష పడింది..