వరంగల్ జిల్లాలో ఆ 9 మందివీ హత్యలే... వీడిన మిస్టరీ..

అవన్నీ హత్యలేనని పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించినట్టు తెలిసింది.

news18-telugu
Updated: May 24, 2020, 8:07 PM IST
వరంగల్ జిల్లాలో ఆ 9 మందివీ హత్యలే... వీడిన మిస్టరీ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో ఉన్న ఒక గోనె సంచుల గోదాం వద్ద పాడుబడ్డ బావిలో లభించిన 9 మంది మృతదేహాలకు సంబంధించిన మిస్టరీ వీడింది. వారందరినీ తానే హత్య చేసినట్టు నిందితుడు పోలీసుల ఎదుట  అంగీకరించినట్టు సమాచారం. మక్సూద్ అతడి కుటుంబసభ్యులకు నిద్రమాత్రలు ఇచ్చి, వారు స్పృహకోల్పోయిన తర్వాత వారిని తీసుకుని వెళ్లి బావిలో పడేసినట్టు పోలీసుల ఎదుట అంగీకరించినట్టు తెలుస్తోంది. బీహార్‌కు చెందిన తన స్నేహితుల సాయంతో ఈ పని చేసినట్టు పోలీసుల ఎదుల బీహార్‌కు చెందిన నిందితుడు అంగీకరించినట్టు సమాచారం అందింది. మరింత సమగ్రమైన విచారణ తర్వాత వరంగల్ పోలీసులు నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు.

నిన్న వరంగల్ ఎంజీఎం వైద్యులు ఆ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఆ ప్రాథమిక నివేదిక ప్రకారం వారంతా నీటిలో మునగడం వల్ల చనిపోయినట్టు నిర్ధారించారు. 9 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించగా, అందులో ఏడుగురి ఊపిరితిత్తుల్లో నీళ్లు కనిపించాయి. రెండు డెడ్ బాడీల్లోని ఊపిరితిత్తుల్లో నీరు కనిపించలేదు. వారి శరీరం మీద గీరుకుపోయిన మచ్చలు ఉన్నాయి. చనిపోయిన తర్వాత తీసుకొచ్చి వేశారా? బతికి ఉండగానే లాక్కొచ్చి అందులో వేశారా? అనే అంశాన్ని పరిశీలిస్తే బతికి ఉన్నప్పుడే తీసుకొచ్చి బావిలో వేసినట్టు కనిపిస్తోందని వైద్యులు చెప్పారు. అలాగే కొన్ని మృతదేహాలు నిద్రపోతున్నప్పుడు తీసుకొచ్చి బావిలో వేసినట్టుగా కూడా ఉన్నాయన్నారు. పెనుగులాట జరిగినట్టు, కొట్టుకున్నట్టు ఎలాంటి ఆనవాళ్లు లేవు. తీవ్ర గాయాలు కూడా లేవని చెప్పారు. రక్తస్రావం లాంటివి కూడా ఏవీ లేవన్నారు.
First published: May 24, 2020, 7:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading