హోమ్ /వార్తలు /క్రైమ్ /

Married Woman: పెళ్లయింది.. మరో వ్యక్తితో లవ్.. అర్ధరాత్రి లవర్‌కు కాల్ చేసి ఊహించని షాక్ ఇచ్చింది..

Married Woman: పెళ్లయింది.. మరో వ్యక్తితో లవ్.. అర్ధరాత్రి లవర్‌కు కాల్ చేసి ఊహించని షాక్ ఇచ్చింది..

సవిత (ఫైల్ ఫొటో)

సవిత (ఫైల్ ఫొటో)

రెండున్నరేళ్ల క్రితం వివాహమైంది. ఆమె భర్త ఉపాధి నిమిత్తం దుబాయ్‌కు వెళ్లి ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆమెకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమెకు, ఆమె ప్రియుడికి మధ్య ఏం మనస్పర్థలు వచ్చాయో తెలియదు గానీ అతనికి అర్ధరాత్రి సమయంలో చనిపోతున్నానంటూ కాల్ చేసి అన్నంత పని చేసింది.

ఇంకా చదవండి ...

అలపుజ: రెండున్నరేళ్ల క్రితం వివాహమైంది. ఆమె భర్త ఉపాధి నిమిత్తం దుబాయ్‌కు వెళ్లి ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆమెకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమెకు, ఆమె ప్రియుడికి మధ్య ఏం మనస్పర్థలు వచ్చాయో తెలియదు గానీ అతనికి అర్ధరాత్రి సమయంలో చనిపోతున్నానంటూ కాల్ చేసి అన్నంత పని చేసింది. ఈ ఘటన కేరళలోని అలపుజలో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అలపుజకు చెందిన సతీష్ అనే యువకుడు సవిత(24) అనే యువతిని రెండున్నరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కొల్లాం జిల్లా అలెన్చెరి గ్రామానికి చెందిన సజు, ఉషా కుమారి దంపతుల కుమార్తె సవిత. సతీష్‌తో సవిత వివాహం ఇరు కుటుంబాల సమక్షంలో ఘనంగా జరిగింది. అయితే.. పెళ్లయిన కొన్ని నెలల తర్వాత సతీష్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అప్పటి నుంచి అత్తారింట్లోనే ఉంటున్న సవితకు మానప్పల్లిలోని సూపర్‌మార్కెట్‌లో పనిచేసే ప్రవీణ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ పలుమార్లు బయట కలిసేవారు. ఈ మధ్య సవితకు, ఆమె ప్రియుడికి మధ్య చిన్నచిన్న గొడవలు మొదలయ్యాయి. సవిత ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపం చెందింది.

ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి తన లవర్‌ ప్రవీణ్‌కు సవిత కాల్ చేసింది. తాను చనిపోతున్నానని చెప్పడంతో కంగారు పడిన ప్రవీణ్ వెంటనే సవిత ఇంటికి వెళ్లాడు. ఆమెకు కాల్ చేసి ఇంటి బయట ఉన్నానని, బయటకు రమ్మని సవితకు కాల్ చేశాడు. ఇద్దరూ ఇంటి బయట చాలాసేపు మాట్లాడుకున్నారు. సవిత భర్త సతీష్ సోదరి కూతురు కూడా వీళ్లు మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడ ఉన్నట్లు తెలిసింది. సవిత, ఆమె ప్రియుడు గంటల కొద్దీ మాట్లాడుకున్నారు. ఈ సంభాషణతో విసిగిపోయిన సవిత కోపంతో ఇంట్లోకి వెళ్లిపోయింది. దీంతో.. ఆమె ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందేమోనన్న భయంతో ప్రవీణ్ పలుమార్లు తలుపు కొట్టాడు. లోపలికి వెళ్లి తలుపు లాక్ చేసుకున్న సవిత ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తలుపు బద్ధలు కొట్టేసరికి ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ విగత జీవిగా కనిపించింది. ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించాలని సవిత తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: Married Woman: ఈమె ఓ బ్యాంక్‌లో సీనియర్ మేనేజర్.. ఇలా జరగడం ఊహించని పరిణామం.. అత్యంత విషాదం..

ఇక్కడ మరో విషయం ఏంటంటే.. సవిత, ఆమె ప్రియుడు ప్రవీణ్‌ ఇద్దరూ సూపర్ మార్కెట్‌లో పనిచేసేవారు. ఆ సమయంలోనే ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. సవిత ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో ఆమె ప్రియుడు ప్రవీణ్ భయంతో కనిపించకుండాపోయాడు. పోలీసులు ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నారు. సవిత ఆత్మహత్యకు అసలు కారణం ఏంటనేది ప్రవీణ్ పట్టుబడితే తెలుస్తుందని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. సవితను అత్తింటి వారు సరిగా చూసుకోలేదని.. ఆమెకు జ్వరం వస్తే సరైన చికిత్స కూడా ఇప్పించలేదని.. అత్తింటి వారిపై తమకు అనుమానం ఉందని సవిత తల్లిదండ్రులు చెబుతున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Crime news, Extra marital affair, Illicit affair, Suicide

ఉత్తమ కథలు