హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime news: భార్య,భర్తల మధ్య చిచ్చు పెట్టిన ప్రియుడు .. భర్త మృతి .. తర్వాత ఏం జరిగిందో తెలుసా..?

Crime news: భార్య,భర్తల మధ్య చిచ్చు పెట్టిన ప్రియుడు .. భర్త మృతి .. తర్వాత ఏం జరిగిందో తెలుసా..?

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Extra marital affair: భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఆమె భర్తను బెదిరించాడు. ఇద్దరూ కలిసి ఉండేందుకు అతడ్ని ఏం చేయమన్నాడో తెలుసా..? ఆ తర్వాత జరిగిన విషయం తెలిస్తే షాక్ అవుతారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Mahabubabad, India

పచ్చని కాపురాలను కూల్చేవే వివాహేతర సంబంధాలు. భర్త ఉండి భార్య వేరే వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోవడం, స్నేహితుల ముసుగులో వాళ్ల భార్యలనే లోబర్చుకోవడం వంటి కేసులు ఎన్నో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వ్యవహారాల్లో ఎక్కువగా నష్టపోయేది భార్య, లేదంటే భర్త కొన్ని సందర్భాల్లో ఇద్దరూ నష్టపోవడంతో, లేదంటే ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కాని మహబూబాబాద్(Mahabubabad)జిల్లాలో మాత్రం ఓ వివాహితతో శారీరక సంబంధం పెట్టుకున్న ప్రియుడి పరిస్థితి ఏమైందో తెలిస్తే షాక్ అవుతారు.

Hyderabad: మాదాపూర్‌ ఎస్‌ఐకి రెండేళ్ల జైలుశిక్ష .. ఛీ ఆ విషయంలో కక్కూర్తి పడినందుకే..భర్త చావుకు కారకులెవరూ..

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లెల్ల గ్రామానికి చెందిన కొమిరే జంపయ్య అనే వ్యక్తి అనుమానాస్పస్థితిలో మృతి చెందాడు. ఈసంఘటన స్థానికంగా కలకలం రేపింది. కారణం ఏమిటంటే జంపయ్యకు వివాహం జరిగింది. భార్య కూడా ఉంది. నల్లెల గ్రామానికి చెందిన తోట నరేష్ అనే వ్యక్తి జంపయ్యతో కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. జంపయ్య రోజూ ఇంట్లోనే ఉండటం, ఇద్దరిది ఒకే గ్రామం కావడంతో నరేష్‌ తన ప్రియురాలైన జంపయ్య భార్యను కలవడానికి ఇబ్బందిగా ఉండేది. ఈక్రమంలోనే జంపయ్య అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. జంపయ్య చనిపోవడంతో అతని మృతదేహాన్ని తీసుకొని నరేష్‌ ఇంటి ముందు ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు.

విడాకులివ్వమని ప్రియుడు ఒత్తిడి..

మృతుడు జంపయ్య చనిపోయే ముందు తన భార్యతో నరేష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఫోన్‌లో తమ్ముడికి తెలియజేశాడు. వాళ్ల ఇద్దరికి తాను అడ్డుగా ఉన్నానని తన భార్యకు విడాకులు ఇవ్వమని నరేష్‌ బెదిరిస్తున్నాడని...విడాకులు ఇవ్వకపోతే పిల్లలను కూడా చంపేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడని చెప్పినట్లుగా బంధువులు తెలిపారు. భార్యతో విడాకులు తీసుకోవడం తనకు ఇష్టం లేదని జంపయ్య ఎన్నిసార్లు చెప్పినా తోట నరేష్ వినిపించుకోకుండా బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చినట్లుగా మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు.

Baby sale : 5రోజుల ఆడపిల్ల ఖరీదు 40వేలు .. బిడ్డలను బొమ్మలుగా అమ్ముతున్న తండ్రి .. ఎక్కడంటేహత్యా..? ఆత్మహత్యా..?

ఈవిషయంలో నరేష్‌ గ్రామ పెద్దల మధ్య పంచాయితీ కూడా పెట్టినట్లుగా మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. జంపయ్య తన భార్యకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేదని చెప్పడం వల్లే నరేష్ అతడ్ని చంపేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. తోట నరేష్ ఇంటి ముంద శవంతో ఆందోళన చేపట్టిన వారికి పోలీసులు సర్ది చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Extra marital affair, Mahabubabad, Telangana crime news

ఉత్తమ కథలు