• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MYSORE SP RYSHYANTH LENDS OFFICIAL VEHICLE TO SHIFT ACCIDENT VICTIM TO HOSPITAL SSR

Lockdown: లాక్‌డౌన్ టైంలో యాక్సిడెంట్ అయితే ఇదా పరిస్థితి.. సమయానికి ఈయన అటుగా వెళ్లడంతో..

Lockdown: లాక్‌డౌన్ టైంలో యాక్సిడెంట్ అయితే ఇదా పరిస్థితి.. సమయానికి ఈయన అటుగా వెళ్లడంతో..

ఘటనా స్థలంలో ఎస్పీ రిష్యంత్

మంత్రి ఎస్.టి.సోమశేఖర్ నిర్వహించ తలపెట్టిన సమీక్షకు హాజరయ్యేందుకు ఎస్పీ రిష్యంత్ పోలీసు వాహనంలో వెళుతున్నారు. ఆయన వెళుతున్న దారిలో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై నడిరోడ్డుపై ప్రాణాపాయ స్థితిలో పడి కనిపించాడు. వెంటనే ఎస్పీ రిష్యంత్ తాను వెళుతున్న వాహనాన్ని ఆపి ఆ వ్యక్తి వద్దకు వెళ్లి చూశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ రోడ్డుపై పడి ఉన్న ఆ వ్యక్తిని చూసి ఎస్పీ చలించిపోయారు.

  • Share this:
    మైసూరు: కరోనా కష్టకాలంలో మైసూరు ఎస్పీ సీ.బీ.రిష్యంత్ చూపిన మానవత్వానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే మాటను నిజం చేసిన ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అసలు ఇంతకీ విషయమేంటంటే.. మైసూరు జిల్లాలో కోవిడ్-19 కట్టడిపై మంత్రి ఎస్.టి.సోమశేఖర్ నిర్వహించ తలపెట్టిన సమీక్షకు హాజరయ్యేందుకు ఎస్పీ రిష్యంత్ పోలీసు వాహనంలో వెళుతున్నారు. ఆయన వెళుతున్న దారిలో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై నడిరోడ్డుపై ప్రాణాపాయ స్థితిలో పడి కనిపించాడు. వెంటనే ఎస్పీ రిష్యంత్ తాను వెళుతున్న వాహనాన్ని ఆపి ఆ వ్యక్తి వద్దకు వెళ్లి చూశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ రోడ్డుపై పడి ఉన్న ఆ వ్యక్తిని చూసి ఎస్పీ చలించిపోయారు. క్షణం కూడా ఆలోచించకుండా ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించాలని ఎస్పీ భావించారు. లాక్‌డౌన్ అమలులో ఉండటంతో రోడ్డుపై పెద్దగా వాహనాలు కూడా రావడం లేదు. అంబులెన్స్‌లు కూడా కోవిడ్-19 పేషంట్లను తరలించే పనిలో నిమగ్నమయి ఉన్నాయి.

    దీంతో.. ఆ వ్యక్తిని తన అధికారిక వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించాలని డ్రైవర్‌కు చెప్పి పంపించారు. యాక్సిడెంట్ జరిగిన స్పాట్‌లోనే ఉండి మరొక పోలీసు వాహనాన్ని అక్కడికి పిలిపించుకుని అక్కడి నుంచి మంత్రి సమీక్షకు వెళ్లిపోయారు. చావుబతుకుల మధ్య ఉన్న ఒక సామాన్యుడిని ఆసుపత్రికి తరలించేందుకు ఎస్పీ చూపిన చొరవను పలువురు అభినందిస్తున్నారు.

    ఇది కూడా చదవండి: Kadapa: భార్య నాలుగు నెలల గర్భంపై భర్త అనుమానం.. పెళ్లయిన తొమ్మిదేళ్ల తర్వాత...

    ఇక.. ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే.. చంద్రశెట్టి అనే వ్యక్తి ఈఎన్‌‌ఎన్‌ఎన్ వీఈఈ ఎంటర్‌ప్రైజస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తన స్వగ్రామం నుంచి విధులకు వెళ్లేందుకు బైక్‌పై బయల్దేరాడు. అతను బైక్‌పై వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఆ వాహనం డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. లాక్‌డౌన్ కావడంతో ఏ వాహనం కూడా రోడ్డుపై రావడం లేదు. సాయం చేయడానికి ఎవరూ లేరు. అలాంటి సమయంలో.. ఆ వ్యక్తిని ఎస్పీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చంద్రశెట్టి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిసింది.
    Published by:Sambasiva Reddy
    First published: