సెక్స్ ఆయింట్‌మెంట్.. భార్య మాటలు నమ్మినందుకు ఏమైందంటే?

ఆ ఆయింట్‌మెంట్‌ను మర్మాంగానికి అప్లై చేస్తే శృంగారాన్ని మరింత ఎంజాయ్ చేయవచ్చునని భార్య చెప్పడంతో.. ఆమె చెప్పినట్టు చేశాడు. తీరా దాన్ని అప్లై చేశాక అసలు విషయం తెలిసి షాక్ తిన్నాడు.

news18-telugu
Updated: January 14, 2019, 4:45 PM IST
సెక్స్ ఆయింట్‌మెంట్.. భార్య మాటలు నమ్మినందుకు ఏమైందంటే?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. భార్యకు తెలియకుండా భర్తో.. భర్తకు తెలియకుండా భార్యో.. వివాహతేర సంబంధాలు కొనసాగించడం.. ఆపై వాటిని నిలుపుకోవడానికి కట్టుకున్నవాళ్లనే కడతేరుస్తున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోనూ ఓ భార్య భర్తను హత్య చేయడానికి తెలివిగా స్కెచ్ వేసి దొరికిపోయింది.

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌కు చెందిన ఓ ఆర్మీ జవాన్ 'ఆయింట్‌మెంట్' విష ప్రయోగంతో తన భార్య తనను హత్య చేయడానికి ప్రయత్నించిందని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెలవుపై ఇంటికొచ్చిన తనకు.. తన భార్య ఓ ఆయింట్‌మెంట్ ఇచ్చిందని తెలిపాడు. దాన్ని మర్మాంగానికు అప్లై చేయడం ద్వారా శృంగారాన్ని మరింతగా ఆస్వాదించవచ్చునని నమ్మించిందన్నాడు.

భార్య మాటలు నమ్మి దాన్ని తన మర్మాంగాలకు అప్లై చేశానని, ఆ తర్వాత కొద్దిసేపటికే తీవ్రమైన నొప్పి మొదలైందని చెప్పాడు. వెంటనే స్థానిక డాక్టర్ వద్దకు వెళ్లగా.. అది విషపూరిత ఆయింట్‌మెంట్ అని నిర్దారించినట్టు తెలిపాడు. దానివల్ల ప్రాణాలకే ప్రమాదం అని.. అదృష్టవశాత్తు బతికి బట్టకట్టావని డాక్టర్ చెప్పినట్టు తెలిపాడు.జవాన్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జవాన్‌పై ప్రయోగించిన విషపూరిత ఆయింట్‌మెంట్‌ను ఇంకా స్వాధీనం చేసుకోలేదని, స్వాధీనం చేసుకున్నాక దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తామని పోలీసులు చెప్పారు.


First published: January 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading