కన్న కూతురిపై 15 ఏళ్లుగా తండ్రి అత్యాచారం...తల్లికి తెలిసినా...

ఇటీవల చిన్న కూతురిపై కూడా ఆ కామాంధుడి కన్ను పడింది. తనలాగే తన చెల్లి జీవితం నాశనమైపోతుందన్న భయంతో ఇన్నాళ్లకు ఆమె బయటకొచ్చి పోలీసులను ఆశ్రయించింది.

news18-telugu
Updated: August 21, 2019, 7:32 PM IST
కన్న కూతురిపై 15 ఏళ్లుగా తండ్రి అత్యాచారం...తల్లికి తెలిసినా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది..! మానవత్వానికి మచ్చతెచ్చే దారుణ ఉదంతమిది..! ఏ తండ్రీ చేయకూడని ఘోరాన్ని ఆ కిరాతకుడు చేశాడు. రక్తం పంచుకు పుట్టిన కూతురిపై కన్నతండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. 15 ఏళ్లుగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం బాలిక తల్లికి తెలిసే జరిగింది. కళ్లముందే ఇంత ఘోరం జరుగుతున్నా ఆపకుండా..భర్తకే మద్దతిచ్చింది. అంతేకాదు కూతురికి గర్భం రాకుండా గర్భ నిరోధక మాత్రలు వేసేది. యూపీలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 21 ఏళ్ల ఓ మహిళ లక్నో శివారులోని చిన్‌హాట్ ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. ఆమెపై సొంత తండ్రే దశాబ్ధ కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. తల్లి కూడా అతడికి సహకరించడంతో బాధితురాలు ఒంటరిదైపోయింది. మౌనంగా ఏడుస్తూ 15 ఏళ్లుగా సొంతింట్లోనే నరకయాతన అనుభవిస్తోంది. ఐతే ఇటీవల చిన్న కూతురిపై కూడా ఆ కామాంధుడి కన్ను పడింది. తనలాగే తన చెల్లి జీవితం నాశనమైపోతుందన్న భయంతో ఇన్నాళ్లకు ఆమె బయటకొచ్చి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె తల్లిదండ్రులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు