Home /News /crime /

ఓర్నీ.. సులభ్ కాంప్లెక్స్ ను కూడా వదల్లేదుగా.. దాంట్లో కూడా దుకాణం తెరిచేశారు..!

ఓర్నీ.. సులభ్ కాంప్లెక్స్ ను కూడా వదల్లేదుగా.. దాంట్లో కూడా దుకాణం తెరిచేశారు..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ వ్యక్తి నిర్వాకం వల్ల ఈ వింత విచిత్ర సంఘటన జరిగింది. సులభ్ కాంప్లెక్స్ ను నిర్వహించమని ఓ వ్యక్తికి అప్పజెప్పితే, అతడు దాన్ని కాస్తా అతడు తన వ్యాపార కేంద్రంగా మార్చుకున్నాడు. అధికారులు తనిఖీకి వచ్చి, ఆ సులభ్ కాంప్లెక్స్ లో ఏం అమ్ముతున్నాడో తెలిసి..

ఇంకా చదవండి ...
    మీకు మటన్ కావాలంటే ఏం చేస్తారు? దగ్గరలోని మటన్ షాపునకు వెళ్లి కోడి మాంసాన్ని తెచ్చుకుంటారు. గుడ్లు కావాలన్నా సరే ఏ చికెన్ సెంటర్లోనో, కిరాణా దుకాణాల్లోనో కొనుక్కుంటుంటారు. కానీ ఓ ప్రాంతంలో మాత్రం మటన్, గుడ్ల కోసం సులభ్ కాంప్లెక్స్ వద్దకు వెళ్తున్నారు. అదేంటి? మలమూత్ర విసర్జన చేసే కాంప్లెక్స్ లో మటన్ , గుడ్లను అమ్మడం, కొనడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇదే జరిగింది. ఓ వ్యక్తి నిర్వాకం వల్ల ఈ వింత విచిత్ర సంఘటన జరిగింది. సులభ్ కాంప్లెక్స్ ను నిర్వహించమని ఓ వ్యక్తికి అప్పజెప్పితే, అతడు దాన్ని కాస్తా మటన్, గుడ్లు అమ్మే కేంద్రంగా మార్చేసుకున్నాడు. ఓ వైపు సులభ్ కాంప్లెక్స్ నిర్వహణకు వచ్చే జీతంతోపాటు, సొంత వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టాడు. మున్సిపాల్టీ అధికారుల చెకింగ్ సమయంలో అడ్డంగా దొరికిపోయాడు.

    మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగర పరిథిలో సులభ్ కాంప్లెక్స్ ను నిర్వహించే ఓ వ్యక్తి కనీవినీ ఎరుగని వింత నిర్వాకానికి పాల్పడ్డాడు. ఓ వైపు సులభ్ కాంప్లెక్స్ ను నిర్వహిస్తూనే, దాని ముందే మటన్, గుడ్ల అమ్మకం మొదలు పెట్టాడు. ఇతడి నిర్వాకాన్ని కొందరు మున్సిపాల్టీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇండోర్ మున్సిపాల్టీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఇతడు అడ్డంగా దొరికిపోయాడు. వెంటనే అతడికి వెయ్యి రూపాయల జరిమానా విధించారు. అదే సమయంలో సులభ్ కాంప్లెక్స్ లను నిర్వహించే ఎన్జీవో సులభ్ ఇంటర్నేషనల్ సంస్థకు 20వేల రూపాయల జరిమానాను విధించారు.

    మొత్తానికి ఓ వ్యక్తి నిర్వాకం వల్ల అటు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడటంతోపాటు, ఇటు సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకులు కూడా అప్రతిష్టకు గురయ్యారు. సులభ్ కాంప్లెక్స్ లో మటన్, గుడ్ల వ్యాపారం జోరుగా నడుస్తోందన్న వార్తలపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడిచింది. నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అతడు పెట్టగానే, కొనేవాళ్లకు ఏమయిందంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ నిర్వాకానికి పాల్పడిన వ్యక్తిని జరిమానాతో కాకుండా అరెస్ట్ చేసి జైలుకు పంపాలనీ, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యక్తికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, CYBER CRIME, Husband kill wife, Wife kill husband

    తదుపరి వార్తలు