హోమ్ /వార్తలు /క్రైమ్ /

బ్రాహ్మణ యువతిని పెళ్లి చేసుకొనేందుకు.. ఓ ముస్లిం ఏం చేశాడంటే..

బ్రాహ్మణ యువతిని పెళ్లి చేసుకొనేందుకు.. ఓ ముస్లిం ఏం చేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కబీర్ శర్మ బ్రహ్మణుడు కాదని, అతడు ముస్లిం అని... ఇప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిసింది. పైగా, పెళ్లి కోసం ఇమ్రాన్ నకిలీ తల్లిదండ్రులను, నకిలీ బంధువులను సృష్టించాడని తేలడంతో వధువు తండ్రి షాక్‌కు గురయ్యాడు.

అతగాడు ముస్లిం వర్గానికి చెందినవాడు. పేరు ఇమ్రాన్ భాటి. పెళ్లై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. బ్రాహ్మణ కులానికి చెందిన అమ్మాయిని ఇష్టపడ్డారు. ముస్లిం అని చెబితే ఒప్పుకోదు. పైగా, పెళ్లి అయినట్లు తెలీకూడదు. వెంటనే అతడికి ఓ ఆలోచన తట్టింది. తానే బ్రాహ్మణుడి అవతారం ఎత్తి కబీర్ శర్మగా పేరు మార్చుకున్నాడు. ఆమె వద్దకు వెళ్లి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటానన్నాడు. మనోడు నచ్చడంతో ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులను ఒప్పించింది. వారూ సరేనని మే 13న అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించి, రూ.11 లక్షల కట్నం, రూ.5లక్షల బంగారు ఆభరణాలు ముట్టజెప్పారు. పెళ్లైన నాలుగు రోజులకే మరింత కట్నం కోసం నవవధువును పుట్టింటికి పంపి ఆ డబ్బు తెప్పించుకొని ఆమెతో సహా పరారయ్యాడు. ఈ విచిత్ర ఘటన రాజస్థాన్‌లోని శిఖర్‌లో చోటుచేసుకుంది.


కూతురికి ఫోన్ చేస్తే ఎంతకూ కలవకపోవడంతో అనుమానం వచ్చిన వధువు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో అసలైన నిజాలు బయటపడ్డాయి. కబీర్ శర్మ బ్రహ్మణుడు కాదని, అతను ముస్లిం అని... ఇప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిసింది. పైగా, పెళ్లి కోసం ఇమ్రాన్ నకిలీ తల్లిదండ్రులను, నకిలీ బంధువులను సృష్టించాడని తేలడంతో వధువు తండ్రి షాక్‌కు గురయ్యాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెళ్లికి వీడియోగ్రాఫర్లను, ఫోటో గ్రాఫర్లను కూడా ఇమ్రానే మాట్లాడాడట.

First published:

Tags: Jaipur S20p07, Marriage reception, Rajasthan

ఉత్తమ కథలు