MUSIC TEACHER MOLESTS AND HARASSING HIS STUDENT IN DELHI POLICE ARRESTED HIM SU
అసభ్యకరంగా తాకడం, అశ్లీల మెసేజ్‌లు పంపడం.. విద్యార్థినికి సంగీతం టీచర్ వేధింపులు..
ప్రతీకాత్మక చిత్రం
Teacher Molests His Student: సంగీతం నేర్చుకునేందుకు వచ్చిన విద్యార్థిపై ఓ టీచర్ వేధింపులకు పాల్పడ్డాడు. అసభ్యకరంగా తాకడమే కాకుండా, అశ్లీల సందేశాలు పంపుతూ ఇబ్బందికి గురిచేశాడు.
సంగీతం నేర్చుకునేందుకు వచ్చిన విద్యార్థిపై ఓ టీచర్ వేధింపులకు పాల్పడ్డాడు. అసభ్యకరంగా తాకడమే కాకుండా, అశ్లీల సందేశాలు పంపుతూ ఇబ్బందికి గురిచేశాడు. బాధిత విద్యార్థి తన తల్లితో కలిసి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన దేశ రాజధాని డిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు.. 52 ఏళ్ల నిందింతుడు ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. రిథమ్ ఇన్స్స్ట్రుమెంట్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. అతడు తన వద్ద సంగీతం నేర్చుకుంటున్న 23 ఏళ్ల విద్యార్థినిపై వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెకు శిక్షణ ఇస్తున్న సమయంలో వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు తన తల్లితో కలిసి డిసెంబర్ 14వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ట్రైనింగ్ సెషన్లో టీచర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
నిందితుడు తనను అనుచితంగా తనను టచ్ చేసేవాడని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. డిసెంబర్ 14వ తేదీన కూడా అతడు తనపై వేధింపులకు పాల్పడ్డాడని చెప్పింది. తన నడుము మీద చేయి వేసి నుదుటిపై ముద్దు పెట్టకున్నాడని, ఆ తర్వాత తన ముఖం ముద్దు పెట్టుకునేందుకు ట్రై చేశాడని ఆరోపించింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు సెక్షన్ 354, సెక్షన్ 354A, సెక్షన్ 509ల కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు న్యూ ఢిల్లీ డీసీపీ ఈష్ సింఘాల్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు.
ప్రస్తుతం నిందితుడు జ్యూడిషయల్ కస్టడీలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు. బాధితురాలి శిక్షణ తీసుకుంటున్న ఇనిస్టిట్యూట్‌లోని మిగతా విద్యార్థుల స్టేటమేంట్స్ కూడా రికార్డు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.