Home /News /crime /

MURDER SUICIDE IN CHENNAI MAN KILLS WIFE AND CHILDREN BEFORE ENDING LIFE PVN

Shocking:రంపంతో కోసి భార్యా,పిల్లలను దారుణంగా హత్య చేశాడు..ఆపై..

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Man Murder wife and children : తమిళనాడు(Tamilnadu)లో విషాద ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు విగతజీవులుగా పడి ఉండటం కలకలం రేపింది.

Man Murder wife and children : తమిళనాడు(Tamilnadu)లో విషాద ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు విగతజీవులుగా పడి ఉండటం కలకలం రేపింది. అప్పుల భారంతో ఓ వ్యక్తి..తన భార్య మరియు ఇద్దరు పిల్లల గొంతు కోసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని పోలీసులు శనివారం తెలిపారు.

తమిళనాడులోని చెన్నై సబర్బన్‌ పొలిచలూరులో 41 ఏళ్ల ప్రకాష్ కి.. భార్య గాయత్రి (35), కుమారుడు హరికృష్ణన్ (11), కుమార్తె నిత్యశ్రీ (9) ఉన్నారు. ఆయుర్వేద మందుల దుకాణం నడుపుతున్న ప్రకాష్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నాడు. చేసిన అప్పులు తలకు మంచిన భారంగా మారాయి. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఎదురయ్యాయి. ఈ విషయంలో తరచూ ప్రకాష్అతడి భార్య మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ప్రకాష్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. రంపం కోసే యంత్రంతో భార్య,పిల్లలను దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత అతడు ఆత్మహత్య చేసుకున్నట్టుగా కనిపిస్తోందని పోలీసులు తెలిపారు. నలుగురు వ్యక్తులు తమ ఇంట్లో విగతజీవులుగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో మృతదేహాలను చెన్నై సబర్బన్‌ పొలిచలూరులోని ఇంట్లో పోలీసులు శనివారం ఉదయం గుర్తించారు. దీనిపై శంకర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కిల్‌పాక్‌ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ALSO READ Viral News: అలాగైతే పదవీ విరమణ చేయండి.. ఉద్యోగులకు షాక్ ఇచ్చిన కలెక్టర్..

మరోవైపు,తెలంగాణలో ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి చనిపోయింది. కొద్ది నెలల క్రితం వివాహం చేసుకున్న అమ్మాయి పుట్టింట్లో రక్తపు మడుగులో పడి ఉంది. ప్రాణాలు తీసుకుందని సొంత మనుషులు చెబుతున్నారు. కాదు చంపేశారని గ్రామస్తులు అంటున్నారు. పోలీసు(Police)లకు ఈ కేసులో ఏం జరిగిందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కేసును లోతుగా దర్యాప్తు చేస్తూనే..మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల స్టేట్‌మెంట్‌(Statement) ఆధారంగా కూపీ లాగుతున్నారు. ఈ మిస్టరీ డెత్‌(Death Mystery)ఆదిలాబాద్( Adilabad)జిల్లాలో వెలుగుచూసింది. చనిపోయిన యువతి పేరు రాజేశ్వరి. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌ మండలం నాగలకొండ గ్రామం మృతురాలి స్వస్తలం. కొద్ది నెలల క్రితమే ఓ వ్యక్తిని ప్రేమించింది. తల్లిదండ్రులకు ఆ విషయం నచ్చకపోవడంతో ఆమె వాళ్లను కాదని ప్రియుడ్ని ప్రేమవివాహం చేసుకుంది. రాజేశ్వరి ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత అదే విషయంపై పంచాయితీ కూడా జరిగినట్లుగా తెలుస్తోంది.

పరిస్థితులు ఈవిధంగా ఉన్న క్రమంలో రాజేశ్వరి పుట్టింట్లోనే చనిపోయింది. యువతి మెడపై కత్తితో గాయపర్చినట్లుగా గుర్తులు ఉండటం, అధికరక్తస్రావం జరగడం వల్లే రాజేశ్వరి రక్తపుమడుగులో పడి ఉంది. విషయం తెలిసిన వెంటనే పోలీసు జాగిలాలను తీసుకొని నాగలకొండ గ్రామానికి వెళ్లారు. రాజేశ్వరి ఎలా మృతి చెందింది అని పోలీసులు ఆమె తల్లిదండ్రుల్ని విచారిస్తే ..తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. గ్రామస్తులు, ఇంటి చుట్టుపక్కల వాళ్లు మాత్రం రాజేశ్వరిని తల్లిదండ్రులే హత్య చేశారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. కూతురు వేరే సామాజికవర్గానికి చెందిన యువకుడ్ని ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో హత్య చేసి ఉంటారని పోలీసులకు తెలిపారు. ఇది కచ్చితంగా పరువు హత్యేనంటూ పోలీసులకు క్లూ అందించారు. ప్రాధమిక విచారణలో భాగంగానే ఇంట్లో మృతదేహాన్ని పరిశీలించారు పోలీసులు. చుట్టుపక్కల మొత్తం డాగ్ స్క్వాడ్‌తో సాక్ష్యాధారాల కోసం గాలించారు. అనుమానాస్పదమృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Burtally murder, Husband kill wife, Tamilnadu

తదుపరి వార్తలు