Home /News /crime /

MURDER OF TRS COUNCILOR IN MAHABUBABAD SNR KMM

Mahabubabad: టీఆర్ఎస్‌ కౌన్సిలర్ మర్డర్..సినీ ఫక్కీలో గొడ్డలితో నరికి చంపిన ప్రత్యర్ధులు

(కౌన్సిలర్ దారుణ హత్య)

(కౌన్సిలర్ దారుణ హత్య)

Mahabubabad:మహబూబాబాద్‌లో అధికారపార్టీకి చెందిన కౌన్సిలర్‌ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. 8వార్డ్ కౌన్సిలర్‌ రవి బైక్‌పై వెళ్తుండగా గొడ్డలితో నరికారు. రక్తపుమడుగులో పడివున్న రవిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. ఈఘటనతో మహబూబాబాద్‌లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

ఇంకా చదవండి ...
    మహబూబాబాద్ (Mahabubabad)పట్టణంలో టీఆర్‌ఎస్‌(TRS) వార్డు కౌన్సిలర్‌(councilor)ని దారుణంగా హత్య చేశారు. సినీ ఫక్కీలో బైక్‌పై వెళ్తున్న 8వ వార్డు కౌన్సిలర్‌ బానోతు రవి(Banotu Ravi)ని గుర్తు తెలియని వ్యక్తులు వెనుక నుంచి గొడ్డలితో నరకడంతో రోడ్డుపైనే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో పడివున్న రవిని వదిలేసి దుండగులు పారిపోయారు. ప్రాణాలతో కొట్టుకుంటున్న కౌన్సిలర్‌ని స్థానికులు వెంటనే మహబూబాబాద్‌ ఏరియా ఆసుపత్రి(Area Hospital)కి తరలించారు. అక్కడ వైద్యులు కౌన్సిలర్‌ రవికి చికిత్స అందిస్తున్న సమయంలోనే మృతి చెందాడు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని పత్తిపాక కాలనీ(Pattipaka colony)దగ్గర ఈ మర్డర్ జరగడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. చనిపోయిన కౌన్సిలర్ రవి 8వ వార్డు పత్తిపాక నుంచి ఇండిపెండెంట్‌(Independent‌)గా గెలుపొందినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత అధికారపార్టీ టీఆర్‌ఎస్‌లో చేరాడు. మృతుడు రవిని చంపిన వ్యక్తులు ఎవరూ ఇప్పటికి వరకు తెలియరాలేదు.

    సినీ ఫక్కీలో మర్డర్..
    అయితే స్థానికులు, పోలీసులకు తెలిసిన సమాచారం ప్రకారం ..మృతుడు భూలావాదేవీలు, నల్లబెల్లం వ్యాపారం వంటి విషయాల్లో తలదూర్చేవాడని..అతనికి బిజినెస్‌లో ఆర్ధికపరమైన విభేదాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బిజినెస్‌లో ఉన్న ప్రత్యర్దులే కౌన్సిలర్‌ రవిని దారుణంగా హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు కౌన్సిలర్ మర్డర్‌తో మహబూబాబాద్‌ టౌన్‌లో ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితుల్ని అర్ధం చేసుకున్న పోలీసులు భారీగా బలగాల్ని మోహరించారు.

    అధికార పార్టీ కౌన్సిలర్‌ హతం..
    మరోవైపు కౌన్సిలర్ రవి చనిపోయిన వార్త తెలుసుకున్న ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో మహబూబాబాద్‌ ఏరియా ఆసుపత్రికి తరలివచ్చారు. హత్యకు కారణమైన వాళ్లను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కౌన్సిలర్ రవి మనుషులు, కుటుంబసభ్యులు ఒక్కసారిగా ఏరియా ఆసుపత్రి దగ్గరకు చేరుకోవడంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. మరోవైపు పోలీసులు కుటుంబ సభ్యులను కంట్రోల్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని..దోషుల్ని పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Crime news, Mahabubabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు