హోమ్ /వార్తలు /క్రైమ్ /

Murder: లైంగికవాంఛ తీర్చనందుకు వృద్ధురాలిపై పగ.. కాళ్లు, చేతులు నరికి.. మొండెం భాగాన్ని రైల్వే పట్టాలపై వేసి.. అతికిరాతకంగా..

Murder: లైంగికవాంఛ తీర్చనందుకు వృద్ధురాలిపై పగ.. కాళ్లు, చేతులు నరికి.. మొండెం భాగాన్ని రైల్వే పట్టాలపై వేసి.. అతికిరాతకంగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Murder: లైంగిక కోరిక తీర్చలేదని ఓ వృద్ధురాలిని అతి కిరాతకంగా హత్య చేశారు. కాళ్లు, చేతులను కల్చేశాడు. అనంతరం మొండెం భాగాన్ని గోనె సంచిలో వేసుకొని స్నేహితుడి సహాయంతో రైలు పట్టాలపై పడేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

ఇంకా చదవండి ...

కామంతో కళ్లు మూసుకుపోయిన వాడికి ఏమి చేస్తున్నడో అర్థం కాదు. అలాంటిదే ఒకటి ఇక్కడ జరిగింది. ఓ వృద్ధురాలిపై కన్నేసిన కామాంధుడు గత కొన్ని రోజుల నుంచి లైంగిక వాంఛ తీర్చమని వేధిస్తున్నాడు. అయితే బాధితురాలు ఈ విషయం గ్రామంలో తెలిసినవారందరికీ చెప్పింది. దీన్ని జీర్ణించుకోలేని ఆ ప్రబుద్ధుడు ఆమెను బలవంతంగా ఓ ప్రదేశానికి తీసుకెళ్లాడు. కాళ్లు, చేతులు, తల భాగాలను నరికి .. వాటిని అక్కడే కాల్చాడు. మొండెం భాగాన్ని మాత్రం ఓ బస్తాలో వేసుకొని అక్కడ నుంచి బయలుదేరాడు. ఆ మొండెం ను ఊరు శివారులో పడేద్దామనుకున్నాడు. స్నేహితుడికి ఫోన్ చేసి రప్పించాడు. ఆ బస్తా నుంచి దుర్వాసన వస్తుందని అది ఏంటని అడగ్గా అది కాల్చిన అడవిపంది అని సమాధానం ఇచ్చాడు. అయితే అతడి స్నేహితుడి సహాయంతో హబూబాబాద్ జిల్లా గార్ల మండలం తిర్లాపురం రైల్వే ట్రాక్ పై పడేశాడు. అనుమానం వచ్చిన అతడి స్నేహితుడు దానిని విప్పి చూశాడు. అంతే అతడు షాక్ కు లోనయ్యాడు. భయాందోళనకు గురయిన సదరు వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బజ్యాతండాకు చెందిన వృద్ధురాలు అజ్మీర నాజీ(70) నివాసం ఉంటుంది. నాజీ భర్త 20ఏళ్ల క్రితం మరణించాడు. ఈమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ తండాలో ఉంటున్నారు. నాజీ కొంత మతిస్థితిమితం కోల్పోయి కుమారుల వద్ద ఉండకుండా కారేపల్లిలో రహదారుల వెంట, రైల్వేస్టేషన్‌, ఇతర ప్రాంతంలో తలదాచుకుంటూ తిరిగేది. కుమారులు ఇంటికి తీసుకెళ్లినా వారిని దుర్భాషలాడి మళ్లీ కారేపల్లి వస్తుండేది. కొన్ని రోజుల నుంచి కారేపల్లి మండలం అంబేడ్కర్ కాలనీకి చెందిన ఆదెర్ల ఉపేందర్‌(43) ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాధితురాలు ఈ విషయాన్ని గ్రామంలో తెలిసిన వాళ్లందరికీ చెప్పింది. దీన్ని జీర్ణించుకోలేని ఉపేందర్‌ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైన ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు రాత్రి ఆమెను చీమలపాడు రహదారి వైపు బలవంతంగా తీసుకెళ్లాడు. బలవంతంగా కాళ్లు, చేతులను కట్టేశాడు. ఆమె వద్దు వద్దు అని ఎంత చెప్పినా వినలేదు.

తలను మొండెం భాగాన్ని అతికిరాతకంగా నరికి హత్య చేశాడు. కళ్లను ,చేతులను అక్కడే ముక్కలు ముక్కలుగా నరికి కాల్చేశాడు. మొండెం భాగాన్ని మాత్రం బస్తాలో వేసి ఊరు చెవర పడేద్దామని బయలు దేరాడు. అతడి స్నేహితుడి సహాయంతో దానిని మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం తిర్లాపురం రైల్వేట్రాక్‌పై పడేశాడు. అయితే అనుమానం వచ్చిన అతడు దానిని తెరిచి చూశాడు. భయాందోళనకు గురైన అతడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఉపేందర్ ను పట్టుకుని విచారణ చేస్తున్నారు. రైల్వే పోలీసులు, ఖమ్మం రూరల్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, ఎస్సై సురేశ్‌ ఘటనా స్థలంలో పరిశీలించారు. విచారణలో అతడు లైంగిక కోరిక తీర్చనందుకే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మరోవైపు క్షుద్ర పూజల నేపథ్యంలోనే వృద్ధురాలిని హత్య చేశారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉపేందర్ తోపాటు మరి కొందరు కూడా హత్యలో పాలు పంచుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Burtally murder, Crime, Crime news, Karepally, Khammam, Murder, Old women killed, Sexual harrassment, Women harrasment

ఉత్తమ కథలు