Home /News /crime /

MURDER OF A YOUNG MAN WHO WENT TO MEET GIRLFRIEND IN GOPALGANJ BEHEADED BODY FOUND IN RIVER SSR

Lovers: ఆగస్ట్ 3న నైట్ టైంలో లవర్‌ను కలిసేందుకు వాళ్లూరు వెళ్లాడు.. ఊహించని షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే.. ఆగస్ట్ 8న..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బీహార్‌లో ఘోరం జరిగింది. తన కూతురిని ప్రేమిస్తున్నాడనే కారణంగా ఓ యువకుడిని ఆ యువతి కుటుంబం తలను, మొండాన్ని వేరు చేసి చంపిన ఘటన కలకలం రేపింది. బీహార్‌లోని గోపాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

    గోపాల్‌గంజ్: బీహార్‌లో ఘోరం జరిగింది. తన కూతురిని ప్రేమిస్తున్నాడనే కారణంగా ఓ యువకుడిని ఆ యువతి కుటుంబం తలను, మొండాన్ని వేరు చేసి చంపిన ఘటన కలకలం రేపింది. బీహార్‌లోని గోపాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని గోపాల్‌గంజ్ తాలూకాలోని రూప్చప్ గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ అనే యువకుడు, సరిగ్గా ఆ గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిపయఖస్ గ్రామానికి చెందిన అన్షు కుమారి ప్రేమలో ఉన్నారు. ఐదేళ్ల నుంచి వీరి ప్రేమ కొనసాగుతోంది. ఇద్దరూ తరచుగా పెద్దలకు తెలియకుండా బయట కలుస్తుండేవారు. సినిమాలకు, షికార్లకు వెళుతుండేవారు. ఈ క్రమంలోనే.. ఆగస్ట్ 3న తన ప్రేయసి అన్షు కుమారిని కలిసేందుకు ఆమె ఉంటున్న గ్రామానికి ప్రేమ్ కుమార్ వెళ్లాడు. అయితే.. ఆ రోజు నుంచి ప్రేమ్ కుమార్ కనిపించకుండా పోయాడు. ప్రేమ్ కుమార్ కనిపించకుండాపోవడంతో అతని అన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. ఆ యువతి కుటుంబం ప్రేమ్ కుమార్‌ను చంపి.. తలను, మొండాన్ని వేరుచేసి సమీపంలోని నదిలో పడేసినట్లు తెలిసింది. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ సిబ్బంది సాయంతో పోలీసులు ప్రేమ్ కుమార్ మొండాన్ని, తలను వెలికితీశారు. ఈ కేసు గురించి గోపాల్‌గంజ్ ఎస్‌డీపీవో నరేష్ పాశ్వాన్ మరిన్ని వివరాలు వెల్లడించారు.

    ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్ట్ 3న రాత్రి సమయంలో తన ప్రియురాలిని కలుసుకునేందుకు ప్రేమ్ కుమార్ ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే.. ఆమెతో కలిసి ఉన్న సమయంలో కుటుంబం గమనించి ఆ యువకుడిపై దాడికి పాల్పడింది. అంతటితో ఆగక.. ఆ యువకుడిని అతి కిరాతకంగా నరికి.. తలను, మొండాన్ని వేరు చేశారు. ఆ తర్వాత నదిలో పడేశారు. ఈ కేసులో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్షు కుమారితో పాటు ఆమె కుటుంబం పరారీలో ఉన్నారు. ఈ కేసులో అన్షు కుమారి పాత్రపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఫోన్ చేసి రమ్మంటేనే ప్రేమ్ కుమార్ ఇంటికి వెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

    ఇది కూడా చదవండి: Sister Photo: ఫ్రెండ్ ఫోన్‌లో తన సిస్టర్ ఫొటోలు ఉండటం చూశాడు.. డిలీట్ చేయమంటే చేయనన్నాడని..

    అన్షు కుమారి, ప్రేమ్ కుమార్ కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆమె, ఆమె కుటుంబం కలిసి ప్రేమ్ కుమార్‌ను హత్య చేశారా లేక ఆమె కుటుంబం బలవంతం చేయడంతో అన్షు కుమారి ఫోన్ చేసి ప్రియుడిని ఇంటికి పిలిచిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అన్షు కుమారి, ఆమె కుటుంబం కోసం గాలిస్తున్నారు. త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని పోలీసులు తెలిపారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Bihar, Brutally murder, Dead body, Lovers

    తదుపరి వార్తలు