జైల్లో తోటి ఖైదీ హత్య... తెరవెనక అక్కపై రేప్ ఘటన... సినిమా రేంజ్‌లో ప్లాన్...

ఆ క్రైమ్ జరిగిన విధానం... అతను వేసుకున్న ప్లాన్ తెలుసుకొని పోలీసులే ఆశ్చర్యపోయారు.

news18-telugu
Updated: July 1, 2020, 10:30 AM IST
జైల్లో తోటి ఖైదీ హత్య... తెరవెనక అక్కపై రేప్ ఘటన... సినిమా రేంజ్‌లో ప్లాన్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అది ఢిల్లీలోని తీహార్ జైలు. ఉదయాన్నే ఖైదీలందర్నీ... ప్రార్థనల కోసం పోలీసులు పంపించారు. ఇంతలో... ఓ సెల్‌లో గట్టిగా కేకలు వినిపించాయి. పోలీసులు వెళ్లి చూసేసరికి... 27 ఏళ్ల మహమూద్ మెహతాబ్ రక్తపు మడుగులో చనిపోయి కనిపించాడు. పక్కనే 21 ఏళ్ల మరో ఖైదీ అహ్మద్  (పేరు మార్చాం) చేతిలో రక్తపు చుక్కలు కారుతున్న కత్తి కనిపించింది. అతనే హత్య చేశాడని అర్థమైంది. కత్తిని స్వాధీనం చేసుకొని... మహతాబ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు. ఆ తర్వాత కత్తితో పొడిచిన అహ్మద్‌ని... ప్రత్యేక గదిలో ఉంచి... ఇంటరాగేషన్ చేశారు. ఏదో సాధించిన వాడిలా చాలా కాన్ఫిడెన్స్‌తో అహ్మద్‌ ఉన్నాడు.

"చెప్పు... ఎందుకు చేశావిలా... అని ప్రశ్నించగా... "పగ తీర్చుకున్నా" అన్నాడు. "పగా... ఏంటది" అని అడిగితే... అసలు విషయం చెప్పాడు. ఇప్పుడు చనిపోయిన మెహతాబ్... 2014లో అహ్మద్‌ అక్కని రేప్ చేశాడు. ఆమె మైనర్. తనకు జరిగిన అన్యాయాన్ని తన తమ్ముడికి చెప్పుకొని ఏడ్చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమె ఆత్మహత్య చేసుకుంది. అప్పట్లో మైనరైన అహ్మద్‌... మెహతాబ్‌పై పగ పెంచుకున్నాడు. చంపేయాలని అనుకున్నాడు. కానీ... మెహతాబ్ రేప్ కేసులో అరెస్టై జైల్లో ఉన్నాడు. ఎలా చంపాలో అర్థం కాలేదు.

ప్రతి రోజూ... అదే ఆలోచన. ఎలా చంపాలి, ఎప్పుడు చంపాలి. ఇలాగే ఏళ్లు గడిచాయి. 2018లో అహ్మద్‌ కావాలనే ఓ మర్డర్ చేశాడు. తద్వారా జైలుకెళ్లాడు. తీహార్ జైలుకి వెళ్లిన అతడు... తన శత్రువు ఎక్కడ ఉన్నాడా అని గమనించాడు. అతను వేరే సెల్‌లో (జైలు నంబర్ 5) ఉన్నట్లు గుర్తించాడు.

అహ్మద్‌ ఉన్నది జైలు నంబర్ 8. ఎలాగైనా... జైలు నంబర్ 5కి చేరాలనుకున్నాడు. అందుకోసం... ఓ తోటి ఖైదీతో గొడవపెట్టుకొని చితకబాదాడు. దాంతో... ఆ బాధిత ఖైదీ... అహ్మద్‌ చాలా క్రూరుడు. ఇతన్ని 8వ నంబర్ జైలుకి పంపండి ప్లీజ్ అని బతిమలాడుకున్నాడు. అసలే హత్య చేసి జైలుకి రావడంతో... సహజంగానే పోలీసులు అతన్ని క్రూరుడిగా అనుమానించారు. తీవ్ర ఖైదీగా గుర్తిస్తూ... జైలు నంబర్ 8కి పంపారు.

అక్కడ తన శత్రువుని చూసిన అహ్మద్‌... "ఎస్ దొరికాడు" అనుకున్నాడు. ఎప్పుడెప్పుడు చంపుదామా అని ప్లాన్ వేస్తూ... ఓ కత్తిని సంపాదించాడు. సరిగ్గా ఆ రోజు అందరూ ఉదయాన్నే ప్రార్థనలకు వెళ్లినప్పుడు... మెహతాబ్‌ని వరుసగా కసాకసా పొడిచాడు. దాంతో మెహతాబ్ చనిపోయాడు. అలా తన పగ తీర్చుకున్నట్లు అతను చెప్పడంతో... సరిపోయింది... అనుకుంటూ పోలీసులు... అహ్మద్‌ను మరో సెల్‌కి పంపారు.
First published: July 1, 2020, 9:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading