హోమ్ /వార్తలు /క్రైమ్ న్యూస్ /

Crime News: కారులో ధర్మా దహనం చేసిన వ్యక్తి ఇతనే..పోలీసుల విచారణలో కీలక పురోగతి

Crime News: కారులో ధర్మా దహనం చేసిన వ్యక్తి ఇతనే..పోలీసుల విచారణలో కీలక పురోగతి

కారులో ధర్మా దహనం చేసిన వ్యక్తి ఇతనే!

కారులో ధర్మా దహనం చేసిన వ్యక్తి ఇతనే!

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తాను హత్యకు గురైనట్లు నమ్మించాలనుకున్న సచివాలయ ఉద్యోగి ధర్మానాయక్ గుట్టును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. ధర్మానాయక్ హత్య చేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Medak, India

(K.Veeranna,News18,Medak)

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తాను హత్యకు గురైనట్లు నమ్మించాలనుకున్న సచివాలయ ఉద్యోగి ధర్మానాయక్ గుట్టును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. ధర్మానాయక్ హత్య చేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ధర్మా నాయక్ హత్య చేసిన వ్యక్తి మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన గల్గాయ్ బాబు పోలీసులు గుర్తించారు. బాబు రోజూ కూలి పని కోసం నిజామాబాద్ కు ట్రైన్  లో వస్తుండేవాడు. అతని లాగే ఉన్న బాబును ధర్మానాయక్ చూసి పిలిచాడు. తన దగ్గర పని ఉంది చేస్తావా అంటూ బాబును ధర్మానాయక్ అతని మేనల్లుడు తేజావత్ శ్రీనివాస్ తో కలిసి కారులో తీసుకెళ్లారు. తరువాత మెదక్ జిల్లా టేక్మల్ మండలం వెంకటాపూర్ వద్ద బాబును గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని కారులో ఉంచి దగ్ధం చేశారు.

అంజయ్య (ఫైల్ ఫోటో)

KTR: బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా కేటీఆర్ .. అలాంటి సంకేతాలు ఇస్తున్నారా ?

అసలు ఏంటి కేసు?

ఈ కేసులో మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వాళ్లందరిని విచారించి అసలు విషయాలు రాబట్టారు. మొదట ధర్మాలాగా ఉన్న వ్యక్తి కోసం నాంపల్లి పొలీస్ స్టేషన్ అడ్డా దగ్గర వెతికారు. అక్కడ అంజయ్య అనే వ్యక్తికి పరిచయం చేసుకున్నారు. అతనికి నిజామాబాద్ లో పని ఉందని జనవరి 7న తీసుకెళ్లాడు. అతన్ని ఎలాగైనా చంపాలని ప్లాన్ వేశారు .అయితే అంజయ్య తాగి వుండటంతో ఇన్సూరెన్స్ వర్తించదని  అతడిని వదిలేసిన ధర్మా, అతని అల్లుడు శ్రీనివాస్ అప్పటికప్పుడు నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో బాబు అనే వ్యక్తిని తీసుకుని వచ్చారు. ఆ తరువాత అతనికి గుండు  గీయించడానికి బాసర తీసుకెళ్లారు. గుండు గీయించి ధర్మా బట్టలు అతనికి వేశారు. అతన్ని అదే కారులో వెంకటపూర్ కి తీసుకువచ్చారు. చెరువు దగ్గరికి రాగానే అతన్ని కారు ముందుకు రమ్మన్నారు. అతను సహకరించకపోవడంతో అతనిపై గొడ్డళ్లు, కర్రలతో దాడి చేశారు. అనంతరం కారును కాలువలోకి తోసేసి పెట్రోల్ పోసి తగల బెట్టారు.

బెడిసికొట్టిన ధర్మానాయక్ ప్లాన్..

తెలంగాణ సచివాలయంలో జాబ్ చేస్తున్న ధర్మానాయక్ ఆన్‌లైన్ ట్రేడింగ్‌తో అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఓ హైడ్రామాకు తెర తీశారు. తాను చనిపోతే వచ్చే ఏడున్నర కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఏడాది క్రితమే పక్క ప్లాన్ వేశారు. తనకు లాగానే ఉండి వ్యక్తి కోసం వెతికి పట్టుకున్నారు. బాబు అనే వ్యక్తి ని చంపి కారులో ఉంచి కాల్చారు. విచారణ చేస్తున్న సమయంలో ఇండోర్ పారిపోగా తిరిగి మెదక్ వస్తుండగా నిందితుడు ధర్మానాయక్ ను పట్టుకున్నారు.

First published:

Tags: Crime, Crime news, Medak, Telangana

ఉత్తమ కథలు