పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయిన నిందితుడు...

పోలీసుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకున్న సాయికిరణ్.. వెంటనే పారిపోయాడు. పోలీసులు తన వద్ద స్వాధీనం చేసుకున్న కత్తితో కూడా పారిపోయాడు.

news18-telugu
Updated: July 13, 2019, 7:35 PM IST
పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయిన నిందితుడు...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 13, 2019, 7:35 PM IST
రాజేంద్రనగర్ హత్యాయత్నం కేసులో కొత్త ట్విస్ట్. పోలీసుల అదుపులో నుంచి ఓ యువకుడు పారిపోయాడు. ఇవాళ ఉదయం హైదరాబాద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన మాజీ భార్య మీద సాయి కిరణ్ అనే వ్యక్తి హత్యాయత్నం చేశాడు. మాజీ భార్యను చంపడానికి సాయికిరణ్ ఓ వేటకొడవలిని తీసుకొచ్చాడు. అయితే, కిరణ్ తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాడని గమనించిన బాధితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నిందితుడు సాయికిరణ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి వద్ద కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, మద్యం మత్తులో ఉన్న అతడిని తీసుకెళ్లిన పోలీసులు పోలీస్ స్టేషన్ బయటే ఉంచేసినట్టు తెలిసింది. పోలీసుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకున్న సాయికిరణ్.. వెంటనే పారిపోయాడు. పోలీసులు తన వద్ద స్వాధీనం చేసుకున్న కత్తితో కూడా పారిపోయాడు.

First published: July 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...