లాకప్‌లో పోలీసులు గ్యాంగ్ రేప్ చేశారు.. హత్య కేసు నిందితురాలు సంచలన ఆరోపణలు

హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఓ 20 ఏళ్ల మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తనను ఐదుగురు పోలీసులు గ్యాంగ్ రేప్ చేశారని ఆరోపించింది.

news18-telugu
Updated: October 19, 2020, 6:09 PM IST
లాకప్‌లో పోలీసులు గ్యాంగ్ రేప్ చేశారు.. హత్య కేసు నిందితురాలు సంచలన ఆరోపణలు
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఓ 20 ఏళ్ల మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తనను ఐదుగురు పోలీసులు గ్యాంగ్ రేప్ చేశారని ఆరోపించింది. లాకప్‌లోనే పది రోజుల పాటు వారు తనపై ఈ దారుణానికి ఒడిగట్టారని తెలిపింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో జరిగింది. అక్టోబర్ 10న మాంగ్‌వాన్ టౌన్‌లోని జైలును తనిఖీ చేసేందుకు అడిషనల్‌ జిల్లా జడ్జితో పాటు కొందరు లాయర్ల వెళ్లగా ఆ మహిళ ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకొచ్చింది. "నేను లాక‌ప్‌లో ఉన్న సమయంలో పోలీస్ సబ్ డివిజనల్ ఆఫీసర్, పోలీస్ స్టేషన్ ఇంచార్జ్, మరో ముగ్గురు కానిస్టేబుల్స్ గ్యాంగ్ రేప్ చేశారు. తర్వాత ఈ విషయం ఎవరికి చెప్పవద్దని బెదిరించారు. అయితే ఈ ఘోరాన్ని వ్యతిరేకించిన ఓ లేడీ కానిస్టేబుల్‌ను ఆమె సినీయర్లు పక్కకు లాగేశారు" అని తెలిపింది.

అయితే ఈ ఘటన గురించి ఇంతకు ముందు ఎందుకు వెల్లడించలేదని తనిఖీ బృందం ఆమెను అడిగినప్పుడు.. ఈ విషయంపై మూడు నెలల క్రితమే జైలు వార్డెన్ కూడా తెలియజేశానని చెప్పింది. ఇక, ఇదే విషయంపై వార్డెన్‌ స్పందిస్తూ.. ఆ యువతి గ్యాంగ్ రేప్ గురించి చెప్పిందని.. అయితే తాను ఆమెను నమ్మలేదని పేర్కొంది.

దీంతో ఈ ఘటనకు సంబంధించి జూడిషియల్ ఎంక్వైరీకి న్యాయమూర్తి ఆదేశించారు. ఈ మేరకు తప్పు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా రేవా ఎస్పీ రాకేష్ సింగ్‌కు లేఖ రాశారు. అయితే తనకు కోర్టు నుంచి ఎలాంటి లేఖ అందలేదని ఎస్పీ రాకేష్ సింగ్ తెలిపారు. మరోవైపు తనపై మే 9 నుంచి మే 21 మధ్య కాలంలో రేప్ జరిగిందని ఆ యువతి చెప్పింది. అయితే పోలీసులు మాత్రం ఆమెను మే 21న అరెస్ట్ చేశామని. గ్రామంలో హత్య జరిగిన ఐదు రోజుల తర్వాత ఆమెను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

మహిళ పోలీసులపై రేప్ ఆరోపణలపై చేయడంపై ఎస్పీ రాకేష్ సింగ్ మాట్లాడుతూ.. "ఆమె హత్య కేసులో నిందితురాలు. ఆ కేసుకు సంబంధించి ఆమెను, ఆమె స్నేహితుడిని మే 21న అరెస్ట్ చేశాం. కాల్ వివరాలు, మొబైల్ లోకేషన్, ఇతర ఆధారాల లభించడంతో వారిని అదుపులోకి తీసుకున్నాం. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని గ్రామస్తుల సమక్షంలో సెప్టెంబర్ 21న సెప్టిక్ ట్యాంక్ నుంచి స్వాధీనం చేసుకున్నాం. అలాగే రక్తపు మరకలు ఉన్న ఆమె బట్టలకు కూడా అక్కడ లభించాయి. హత్యకు గురైన వ్యక్తితో పోరాడిన సమయంలో ఆమె కాలికి గాయం కావడంతో ఆమె వైద్య పరీక్షలు చేయించుకుంది. మే 16 వరకు ఆమె మొబైల్ లోకేషన్ పోలీస్ స్టేషన్‌కు 20 కి.మీ దూరంలో ఉంది" అని తెలిపారు.

తనిఖీ బృందం‌లో సభ్యునిగా ఉన్న లాయర్ సతీష్ మిశ్రా మాట్లాడుతూ.. "సుప్రీం కోర్టు ఆదేశాలతో న్యాయ బృందాలు మహిళా ఖైదీలు ఉన్న జైళ్లను సందర్శించి నివేదికలను పంపడం సాధారణంగా జరుగుతుంటుంది. అక్టోబర్ 10న మేము జైలులో పర్యటించినప్పుడు.. ఆ ఘటన గురించి మా దృష్టికి తీసుకొచ్చింది. అయితే దీని గురించి ఇంతకు ముందు మాట్లాడలేదని అడగ్గా.. మూడు నెలల క్రితమే వార్డెన్‌కు తెలిపినట్టు ఆమె మాకు చెప్పింది. ఈ ఘటన జరిగిన్పుడు జైలులో పోలీసులు ఉన్నారని.. దీని గురించి బయటపెడితే తన తండ్రిని ఈ కేసులో ఇరికిస్తానని పోలీసులు బెదిరించారని ఆమె తెలిపింది. అందుకే భయపడ్డానని ఆమె మాకు వెల్లడించింది"అని చెప్పారు. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన జిల్లా అడిషనల్ జడ్డి..దానిని చీఫ్ జూడిషియల్ మేజిస్ట్రేట్ ముందు ఉంచారని.. వారు దీనిని జిల్లా జడ్డికి అందజేశారని రేవా జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర పాండే తెలిపారు.
Published by: Sumanth Kanukula
First published: October 19, 2020, 6:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading