Home /News /crime /

MURDER ACCUSED WALKS FREE AFTER 26 YEARS IN JAIL PVN

Undertrial prisoner : ఇతను మరో చెన్నకేశవరెడ్డి..26 ఏళ్లు జైలు శిక్ష..చివరికి నిర్దోషిగా రిలీజ్

26 ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదలైన బీర్బల్

26 ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదలైన బీర్బల్

 Murder Accused Walks Free After 26 Years :  వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు. కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది న్యాయ సూత్రం. అయితే పాపం ఈ వ్యక్తి జీవితంలో మాత్రం అది అమలు కాలేదు. ఎవరో చేసిన హత్యకు అతడు 38 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవించాడు.

ఇంకా చదవండి ...
Murder Accused Walks Free After 26 Years :  వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు. కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది న్యాయ సూత్రం. అయితే పాపం ఈ వ్యక్తి జీవితంలో మాత్రం అది అమలు కాలేదు. ఎవరో చేసిన హత్యకు అతడు 38 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవించాడు. యువకుడిగా జైలుకు వెళ్లి.. ఐదు పదులు దాటిన తర్వాత బయటకు వచ్చాడు. నిర్దోషి అని తేలగానే కోర్టులోనే బోరున విలపించాడు. ఇంతకీ అతను ఎవరు? ఇప్పటికైనా న్యాయస్థానం అసలైన దోషిని పట్టుకుందా? చివరికి ఏం జరిగింది?

1993 జూన్ 11న బీహార్(Bihar)రాష్ట్రంలోని గోపాల్​గంజ్ జిల్లాలోని భోర్ పోలీస్ స్టేషన్​ పరిధిలో నివసించే సూర్యనారాయణ్ భగత్​ అనే వ్యక్తి ఉత్తర​ప్రదేశ్(Uttar Pradesh)లోని డియోరియా జిల్లాలోని తండ్వా గ్రాామానికి చెందిన బీర్బల్ భగత్​ తో కలిసి ముజఫర్​పుర్ ​కు పని కోసం వెళ్లాడు. అయితే ముజఫర్​ పుర్ ​వెళ్లిన తర్వాత సూర్యనారాయణ్ కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులంతా వెతికినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో 1993 జూన్ 28న సూర్యనారాయణ్ కుమారుడు పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ చేశాడు. తన తండ్రితో పాటు బీర్బల్ కూడా వెళ్లాడని, అందుకే మిస్సింగ్ కేసులో అతడి ప్రమేయం ఉంటుందని సూర్యనారాయణ్ భగత్​ కుమారుడు అనుమానించాడు. దీంతో FIRలో బీర్బల్ భగత్ పేరును కూడా చేర్చాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల తర్వాత గుర్తు తెలియని ఓ శవాన్ని దేవరియా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవరియా పోలీసులు పంపిన ఫొటోలను గోపాల్ ​గంజ్​లో ఉంటున్న సూర్యనారాయణ్ కుటుంబ సభ్యులు చూసి ఆ మృతదేహం సూర్యనారాయణ్​దేనని ధ్రువీకరించారు. దీంతో మిస్సింగ్ కేసు కాస్తా మర్డర్ కేసుగా మారింది. దీంతో గోపాల్ గంజ్ పోలీసులు బీర్బల్ ని.... 1994 జనవరి 27న స్నేహితుడు సూర్యనారాయణ్ భగత్ ని హత్య చేశారన్న ఆరోపణలపై జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. అప్పటి నుంచి జైలు జీవితం అనుభవిస్తున్న బీర్బల్ ఒక్కరోజు కూడా బెయిల్​ పై బయటకు రాలేదు. 1995 ఫిబ్రవరి 28న ఈ కేసులో పోలీసులు చార్జ్ ​షీట్ నమోదు చేశారు. అయితే, కోర్టులో ఈ విచారణ మెల్లగా సాగింది.

ALSO READ UP : అట్లుంటది యోగి దెబ్బ..అరెస్ట్ చేయండి బాబోయ్ అంటూ స్టేషన్ లో లొంగిపోయిన లిక్కర్ మాఫియా గ్యాంగ్ స్టర్లు

నిజానికి ఈ కేసు విచారణ మొదట ఫాస్ట్​ ట్రాక్ కోర్టులోనే సాగింది. కానీ, మధ్యలో కొన్నేళ్ల పాటు ఫాస్ట్ ​ట్రాక్ కోర్టులను మూసివేయడం వల్ల విచారణ ఆలస్యమైంది. కేసుపై విచారణ జరిపిన బీహార్ లోని గోపాల్​గంజ్ జిల్లా అదనపు సెషన్స్ కోర్టు బీర్బల్​ ను స్థానిక పోలీసుల రిమాండ్​ కు తరలించాలని ఆదేశించింది. మరోవైపు, ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎలాంటి వివరాలు సమర్పించలేదు. వాంగ్మూలం ఇచ్చేందుకు ఒక్కరూ రాలేదు. శవానికి వైద్యపరీక్షలు చేసిన డాక్టర్ జాడ కూడా లేదు. మృతదేహానికి సంబంధించిన పాత చిత్రాలు సైతం సరిగా లేవు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న జిల్లా అదనపు సెషన్స్ జడ్జి నిందితుడిని నిర్దోషిగా తేల్చుతూ తీర్పు చెప్పారు. నిర్దోషి అని తేలగానే కోర్టులోనే బోరున విలపించాడు బీర్బల్. యువకుడిగా జైలుకు వెళ్లి.. ఐదు ప దులు దాటిన తర్వాత బయటకు వచ్చాడు బీర్బల్. ఈ సందర్భంగా బీర్బల్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేయడంతో పాటుగా తమ కుటుంబానికి ప్రభుత్వం సాయమందించాలని కోరుకుంటున్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Bihar, Murder case, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు