Home /News /crime /

Minor Rape: ముంబైలో ఆగని దారుణాలు.. రైల్వే స్టేషన్‌లో బాలికపై అత్యాచారం

Minor Rape: ముంబైలో ఆగని దారుణాలు.. రైల్వే స్టేషన్‌లో బాలికపై అత్యాచారం

 ముంబైలో మైనర్ రేప్

ముంబైలో మైనర్ రేప్

Minor Rape: దేశంలో మహిళలకు, యువతులకు రక్షణ కరువైంది. ఒంటరిగానే కాదు.. స్నేహితులు, బంధువులతో కలిసి వెళ్తున్నా మానవ మృగాలు వదలడం లేదు.

  Minor Rape: సమాజం ఎటు పోతోందో అర్థం అవ్వడం లేదు.. చిన్నారులకు.. యవతులు, మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. కామాంధులు నర రూపరాక్షసులుగా మారుతున్నారు. వారి కోరికలు తీర్చుకోవడానికి మృగాలుగా మారుతున్నారు. అభంశుభం తెలియని చిన్నారుల నుంచి మైనర్లను కూడా వదలడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మానవ మృగాలకు అడ్డుకట్ట పడటం లేదు. దేశ వ్యాప్తంగా అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయి. మహిళ ఒంటరిగా రోడ్డుపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చిన్న పిల్లలు, పెద్ద వాళ్లు అనే తేడా లేదు.. ఎవరికీ రక్షణ లేకుండా పోతోంది. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు నిర్భయ, దిశ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. నిత్యకృత్యంగా మారిన లైంగిక దాడులు, అత్యాచారాలు ఆడపిల్లల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి.

  మహిళపై అత్యాచారం చేసి ఆమె ప్రైవేట్ భాగాల్లో రాడ్ చొప్పించిన దారుణ ఘటన మరువక ముందే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరో దారుణం వెలుగుచూసింది. ఉల్హాస్ నగర్ రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న రైల్వే స్టాఫ్ క్వార్టర్స్ లో 15 ఏళ్ల మైనర్ బాలిక పై అత్యాచారం జరిగింది.

  బాలిక తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి కళ్యాణ్ నుంచి లోకల్ ట్రైన్ లో ఉల్హాస్ నగర్ వచ్చింది. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో రైలు దిగింది. ముగ్గురూ కలిసి ఇంటికి వెళ్తున్నారు. అదే సమయంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఓ వ్యక్తి బాలిక దగ్గరికి వచ్చాడు. అతడి చేతిలో సుత్తి ఉంది. బాలిక ఫ్రెండ్స్ ను అతడు బెదిరించాడు. బాలికను అక్కడే వదిలేసి వెళ్లాలని అన్నాడు. లేదంటే సుత్తితో కొట్టి చంపేస్తానని బెదిరించాడు. దీంతో వారిద్దరూ బాలికను అక్కడే వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ వ్యక్తి బాలికను బలవంతంగా తనతో రైల్వే స్టాఫ్ క్వార్టర్స్ లోకి తీసుకెళ్లాడు. అక్కడ రేప్ చేశాడు.

  ఇదీ చదవండి: ఆన్‌లైన్‌ ఫ్రెండ్ కోసం 300 కిలోమీటర్ల ప్రయాణం.. మద్యం, డ్రగ్స్ ఇచ్చి గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు

  శనివారం ఉదయం బాలిక ఎలాగో అక్కడి నుంచి తప్పించుకుంది. దారిలో వెళ్తున్న వ్యక్తి దగ్గర ఫోన్ తీసుకుని తన ఫ్రెండ్ కి చేసింది. దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఆ ఫ్రెండ్ బాలికకు సూచించింది. అయితే బాలిక ఫిర్యాదును స్వీకరించేందుకు రెండు పోలీస్ స్టేషన్లు నిరాకరించాయి. కేసు తమ పరిధిలోకి రాదని చెప్పి బాలికను స్టేషన్ నుంచి పంపేశారు. చివరికి రైల్వే పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా, కేసు నమోదు చేసుకోని వ్యవహారంపై ముంబై రైల్వే పోలీస్ కమిషనర్ సీరియస్ అయ్యారు. ఆ రెండు పోలీస్ స్టేషన్ల అధికారులపై విచారణకు ఆదేశించారు.

  ఇదీ చదవండి: ఛీ ఛీ వీడిని తండ్రి అంటారా..? ఐదేళ్ల కన్నకూతురిపైనే దారుణం.. ఇలాంటి వాడిని ఏం అనాలి..?

  బాలికకు వైద్య పరీక్షలు చేశామని, కౌన్సిలింగ్ ఇస్తున్నామని పోలీస్ కమిషనర్ చెప్పారు. ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందాన్ని పంపామని, దర్యాఫ్తు కొనసాగుతోందని కమిషనర్ వెల్లడించారు. సకినాక ప్రాంతంలో మహిళపై అత్యాచారం చేసి ఆమె ప్రైవేట్ భాగాల్లో రాడ్ చొప్పించి దారుణం మరువక ముందే బాలికపై అత్యాచారం కలకలం రేపుతోంది. ముంబైలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేసింది.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Crime news, Minor rape, Mumbai, National News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు