హోమ్ /వార్తలు /క్రైమ్ /

చోరీకి వచ్చిన మహిళల బట్టలు విప్పిమరీ చూసిన మహిళలు.. కారణం ఏంటంటే..

చోరీకి వచ్చిన మహిళల బట్టలు విప్పిమరీ చూసిన మహిళలు.. కారణం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mumbai: ఇద్దరు మహిళలు అర్ధరాత్రి చోరీకి వచ్చారు. వీరి అలజడి విని ఇంట్లో వారు అప్రమత్తమయ్యారు. వెంటనే చుట్టుపక్కల వారని కూడా అలర్ట్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Mumbai, India

కొన్ని రోజుల నుంచి పిల్లలను ఎత్తుకుపోయే ముఠా తిరుగుతుందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మహిళలు అంతా అలర్ట్ గా ఉంటున్నారు. ఇదిలా ఉండగా అర్దరాత్రి ముంబైలోని (Mumbai)  మలాడ్ వీధిలో ఇద్దరు మహిళలు చోరికి వచ్చారు. అయితే.. అలర్ట్ అయిన మహిళలు వారిని చుట్టుపక్కలవారు వెంటనే మెల్కొన్నారు.

మహిళలను పట్టుకున్నారు. అయితే.. వారు తొలుత మహిళలు పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాగా భావించారు. ఈ క్రమంలో.. ఇద్దరిని పట్టుకుని బట్టులు తీయించారు. అయితే.. మహిళలుమాత్రం తాము..కేవలం చోరీకి వచ్చామని, పిల్లలను ఎత్తుకుపోయే ముఠా కాదని చెప్పారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్ లో (Uttarakhand) దారుణం జరిగింది.

బీజేపీ సీనియర్ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కాగా, పుల్కిత్ ఆర్య కు చెందిన రిసార్ట్ లో యువతి అంకిత బండారి రిసెప్షనిస్ట్ గా పనిచేస్తుండేది. ఈ క్రమంలో యజమాని ఆమెను కస్టమర్లతో వ్యభిచారం చేయాల్సిందిగా వేధించాడని ఆమె తనన స్నేహితురాలికి వాట్సాప్  చేసి చెప్పింది. ఆ తర్వాత.. కొన్ని గంటలకే శవమై కన్పించింది. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. దీనిపై పోలీసు అధికారులు సీరియస్ గా విచారణ చేపట్టారు.

పోలీసుల ప్రకారం.. రిసార్ట్ కు వచ్చే కస్టమర్లతో వ్యభిచారం చేయాల్సిందిగా పుల్కిత్ ఆర్య, అంకితను (Ankita bhandari murder case) వేధింపులకు గురిచేశాడు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైందని పోలీసులప్రాథమిక విచారణలో తెలింది. బాధితురాలు ఆమె స్నేహితురాలికి పంపిన వాట్సాప్ సందేశాలు కూడా పోలీసులకు చిక్కాయని డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. 19 ఏళ్ల యువతి అంకితను కస్టమర్లతో వ్యభిచారం చేయకపోవడం వలన చంపినట్లు బయటపడింది. దీనిలో రిసార్ట్ యజమాని మరో ఇద్దరు నిందితులు పాల్గొన్నట్లు విచారణలో తెలింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టామని డీజీపీ తెలిపారు. కాగా, నిందితుడిని కోర్టుకు తీసుకెళ్తుండగా కొంత మంది నిందితుడిపై రాళ్లదాడి చేసి,నిరసన చేపట్టారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Mumbai