17 ఏళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకున్న ఆంటీ... ఏం చేసిందంటే...

టెన్త్ క్లాస్ కుర్రాడితో ప్రేమాయణం నడిపిన పక్కింటి ఆంటీ... బాలుడి తల్లిదండ్రులు అడ్డుచెప్పడంతో ఆత్మహత్యాయత్నం... పారిపోయి పెళ్లిచేసుకున్న బాలముదురు ప్రేమికులు... ఆంటీపై పోస్కో చట్టం కింద కేసు పెట్టిన బాలుడి పేరెంట్స్

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 30, 2018, 2:45 PM IST
17 ఏళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకున్న ఆంటీ... ఏం చేసిందంటే...
నమూనా చిత్రం
  • Share this:
17 ఏళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకున్న ఓ ఆంటీ... అతన్ని లైంగికంగా వేధిస్తోందంటూ ఆ బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ విచిత్ర సంఘటన ముంబై నగరంలో జరిగింది. ముంబయిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు ఓ 17 ఏళ్ల కుర్రాడు. పక్కింట్లో ఉండే ఓ మహిళ... అతనితో చనువుగా ఉంటూ శారీరకంగా లోబర్చుకుంది. ఆమె మోజులో పడిన సదరు బాలుడు... ఆంటీని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం అతని ఇంట్లో తెలియడంతో బాలుడి తల్లిదండ్రులు ఆమె మందలించారు. దీంతో ఒంటి మీద కిరోసిన్ పోసుకుని, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది ఆ యువతి.

దీంతో ఏం చేయాలో తెలియక ఆమెతో మాట్లాడవద్దని బాలుడిని మందలించారు అతని తల్లిదండ్రులు, సోదరుడు. అయితే ఆ రోజు రాత్రి ఆంటీని తీసుకుని పారిపోయాడు ఆ కుర్రాడు. ఇద్దరూ నవంబర్ 8, 2017న ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కలిసి తల్లిదండ్రుల ఇంటి పక్కనే కాపురం పెట్టారా ఇద్దరు. అయితే పెళ్లి తర్వాత తన కోరిక తీర్చాల్సిందిగా బాలుడిని శారీరకంగా చిత్రవధకు గురిచేస్తోందని... ఆ కామపిశాచి కారణంగా తమ పిల్లాడు మనోవేదన అనుభవిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలుడి తల్లిదండ్రులు. తమ కొడుకుని పంపించాలని ఆమె ఇంటికి వెళ్లి అడిగితే... విషం తాగుతానని బెదిరిస్తోందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు కుర్రాడు ఆంటీ ప్రేమలో పడి పదో తరగతి పరీక్షల్లో కూడా ఫెయిల్ అవ్వడం విశేషమయితే... ఆమెకు ఇంతవరకే రెండు సార్లు పెళ్లిళ్లు అయ్యి, విడాకులు కూడా తీసుకోవడం కొసమెరుపు.

బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆంటీని అరెస్ట్ చేసిన పోలీసులు... పోస్కో చట్టం కింద ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే బాలుడితో కాపురం కారణంగా వారికి ఓ ఐదు నెలల కూతురు ఉండడంతో ఆ చిన్నారిని చూసుకునేందుకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.

ఇవి కూడా చదవండి...
సారీ బాస్... డబ్బుల్లేకే నీ ల్యాప్‌టాప్ ఎత్తుకెళ్లా... - ఇట్లు ఓ మంచి దొంగ
90 మందిని రేప్ చేసి చంపేశాడు... సీరియల్ కిల్లర్ అరెస్ట్
పోర్న్‌కు అడిక్ట్ అయిన ఓ నేవీ కమాండర్ ఏం చేశాడంటే...
First published: November 30, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading