• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MUMBAI WOMAN HONEY TRAPS BROTHER KILLER AND TRYING TO KILL HIM BUT THE PLAN FOILED SU

సోదరుడిని చంపిన వ్యక్తికి ప్రేమ వల విసిరిన సోదరి.. రివేంజ్ ప్లాన్ మాములుగా లేదుగా.. కానీ..

సోదరుడిని చంపిన వ్యక్తికి ప్రేమ వల విసిరిన సోదరి.. రివేంజ్ ప్లాన్ మాములుగా లేదుగా.. కానీ..

ప్రతీకాత్మక చిత్రం

తమకు ఇష్టమైన వారిని చంపినవారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్స్ వేయడం సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం. తాజాగా అలాంటి ఘటనే నిజజీవితంతో చోటుచేసుకుంది.

  • Share this:
    తమకు ఇష్టమైన వారిని చంపినవారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్స్ వేయడం సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం. తాజాగా అలాంటి ఘటనే నిజజీవితంతో చోటుచేసుకుంది. ఓ మహిళ తన సోదరుడిని చంపినవారిపై ప్రతీకారం తీర్చుకుంది. ఇందుకోసం తన సోదరుడిని చంపిన వ్యక్తికి వలపు వల(హానీ ట్రాప్) విసిరింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే.. 2020 జూన్‌లో ముంబైలోని మలాడ్ ప్రాంతంలో పార్కింగ్ విషయంలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో అల్తాఫ్ షేక్(24) అనే వ్యక్తిని మహ్మద్ సాధిక్ అనే వ్యక్తి హత్య చేశాడు. ఈ హత్య తర్వాత సాధిక్ ఢిల్లీ పారిపోయాడు. ఈ ఘటనతో అల్తాఫ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అల్తాఫ్ మరణంతో అతని సోదరి యాస్మిన్ షాక్‌లోకి వెళ్లిపోయింది. ఎలాగైనా తన సోదరుడిని హత్య చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది.

    అల్తాఫ్ ఫ్రెండ్స్‌ ఫరూఖ్ షేక్(20), ఒవైస్ షేక్(18), మనీస్ సయ్యద్(20), జకీర్ ఖాన్(32), సత్యం పాండే(23)లతో కలిసి సాధిక్‌ను అంతమొందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ హత్య జరిగిన నెల రోజుల తర్వాత యాస్మిన్.. మల్వానీ ప్రాంతంలో అల్తాఫ్ ఫ్రెండ్‌ను కలిసి సాధిక్‌ను చంపేందుకు ప్లాన్ సిద్దం చేసింది. మొదట సాధిక్ ను హాని ట్రాప్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం యాస్మిన్ ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసింది. ఆ అకౌంట్ నుంచి సాధిక్‌తో చాటింగ్ చేయడం ప్రారంభించింది. అయితే అది హాని ట్రాప్ అని తెలియని సాధిక్.. ప్రేమలో పడిపోయాడు. ఈ క్రమంలోనే సాధిక్ యాస్మిన్‌ను కలిసేందుకు ముంబైకి వచ్చాడు. శనివారం సాధిక్‌కు కాల్ చేసిన యాస్మిన్ చోటా కశ్మీర్ ప్రాంతానికి రావాల్సిందిగా కోరింది.

    అయితే అక్కడికి యాస్మిన్‌కు బదులు అల్తాఫ్ ఐదుగురు స్నేహితులు చేరుకున్నారు. వారు సాధిక్ రాక కోసం అంబులెన్స్‌లో వెయిట్ చేస్తున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే సాధిక్ యాస్మిన్ చెప్పిన ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. దీంతో అల్తాఫ్ స్నేహితులు సాధిక్‌ను అంబులెన్స్‌లో ఎక్కించి కిడ్నాప్ చేశారు. అనంతరం అతడిని వాసాయి నైగాన్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేయాలని అనుకున్నారు.

    ప్లాన్ ఎలా బెడిసి కొట్టిందంటే..
    అయితే సాధిక్‌ను బలవంతంగా అంబులెన్స్‌లో ఎక్కించడం చూసిన చోట కశ్మీర్ ప్రాంతంలోని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన నార్త్ రీజియన్ పోలీసులు అంబులెన్స్‌ను ట్రెస్ చేసే పనిలో పడ్డారు. అయితే నిందితులు ఉన్న అంబులెన్స్‌లో పెట్రోలు అయిపోవడంతో వారు మరో కారును అద్దెకు తీసుకున్నారు. ఆ కారులో వారు వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే వైపు బయలుదేరారు. ఆ మార్గంలో పోలీసలు వారిని పట్టుకుని.. సాధిక్‌ను రక్షించారు.

    ఇక, యాస్మిన్‌తో పాటు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అల్తాఫ్ హత్య కేసులోనిందితుడిగా ఉన్న సాధిక్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో యాస్మిన్ వేసిన ప్లాన్ తెలుసుకుని పోలీసులు కూడా షాక్ తిన్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు