హోమ్ /వార్తలు /క్రైమ్ /

హస్కీగా మాట్లాడి.. 54 ఏళ్ల ముసలోడినికి చుక్కలు చూపించిన కిలేడీ.. ట్విస్ట్ మాములుగా లేదుగా..

హస్కీగా మాట్లాడి.. 54 ఏళ్ల ముసలోడినికి చుక్కలు చూపించిన కిలేడీ.. ట్విస్ట్ మాములుగా లేదుగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mumbai: కొన్నిరోజులుగా ఒంటరిగానే ఉంటున్నాడు. ఇంతలో సోషల్ మీడియాలో ఒక అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీంతో తెగ సంబరపడ్డాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Mumbai, India

సోషల్ మీడియా (Social media)  వేదికగా ప్రతిరోజు కొత్త కొత్త మోసాలు వెలుగులోనికి వస్తున్నాయి. అసలు ముక్కు మోహాం తెలియని వారు.. ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పెడుతున్నారు. తీరా దాన్ని యాక్సెప్ట్ చేశాక.. కొన్నిరోజులు చాటింగ్ చేసి, ఆతర్వాత వ్యక్తిగత ఫోటోలు, వివరాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ దందాకు తెరలేపుతున్నారు. మరికొందరు అవతలి వైపు అమ్మాయిగా మాట్లాడుతూ.. ఎదుటి వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని, టెమ్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత వీరి వలలో చిక్కుకుని మాట్లాడగానే.. వీడియో రికార్డులు చేసి డబ్బుల కోసం బెదిరిస్తున్నారు. అడిగినంతా ఇవ్వకపోతే.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ మానసికంగా వేధిస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.పూర్తి వివరాలు.. మహారాష్ట్ర రాజధాని ముంబైలో (Mumbai) దారుణ ఘటన జరిగింది. 54 ఏళ్ల వ్యక్తి కొన్నేళ్లుగా భార్య చనిపోవడంతో తన పిల్లల దగ్గర ఉంటున్నాడు. కొన్నిరోజుల క్రితం అతనికి ప్రియాంక జైన్ అనే యువతి నుంచి ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ వచ్చింది. దీన్ని అతడు యాక్సెప్ట్ చేశాడు. కొన్నిరోజుల పాటు ఇద్దరు చాటింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత.. యువతి హస్కీగా మాట్లాడటంతో వ్యవహారం నెంబర్ మార్చుకొవడం వరకు వచ్చింది. ఇదిలా ఉండగా అతను.. పూర్తిగా యువతి మాయలో పడిపోయాడు.
ఈ క్రమంలో ఒక రోజు... అతనితో న్యూడ్ గా మాట్లాడుకుందామంటూ ఆమె చెప్పింది. దీంతో అతను బాత్రూమ్ కు వెళ్లి ఆమెతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడాడు. ఆ తర్వాత.. అసలు స్టోరి మొదలైంది. ఇక రాత్రి ఆమె ఫోన్ కాల్ చేసి అడిగినంతా డబ్బులు ఇవ్వకపోతే వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరించింది. దీంతో కంగారు పడిపోయిన అతగాడు మొదట 30 వేల రూపాయలను ఆమె చెప్పిన నెంబర్ కు పంపాడు.
అప్పటి నుంచి ఆమె ఫోన్ కాల్ ఆన్సర్ చేయడం మానేశాడు. ఇదిలా ఉండగా... కొత్త నెంబర్ నుంచి సీబీఐ అధికారుల మంటూ కాల్ వచ్చింది. తమకు న్యూడ్ వీడియో రికార్డు అందిందని,యువతి ఫిర్యాదు చేసిందని అన్నాడు. దీంతో 54 ఏళ్ల వ్యక్తికి నోట మాట రాలేదు. రూ. 5.28 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో వీరి వేధింపులు ఎక్కువ కావడంతో జరిగిన విషయాన్ని తన కొడుకులతో చెప్పాడు. ఈ క్రమంలో వారంతా వెళ్లి ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Man harassed, Mumbai

ఉత్తమ కథలు