MUMBAI WOMAN FAILED TO REPAY LOAN RECOVERY AGENT MORPHS HER PHOTO ON GRAPHIC VIDEO PAH
OMG: ఏజెంట్ బాగోతం.. అశ్లీల సైట్ లో యువతి మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు.. కారణం ఏంటంటే...
ప్రతీకాత్మక చిత్రం
Mumbai: ప్రస్తుతం కొన్ని లోన్ యాప్ నిర్వాహకులు కస్టమర్ లను మోసం చేస్తున్నారు. వీరిని నమ్మి రుణం తీసుకున్న వారికి ఆ తర్వాత.. చుక్కలు చూపిస్తున్నారు. కస్టమర్ లను వేధిస్తు, అమానుషంగా ప్రవర్తిస్తున్నారు.
Teen loan recovery agent held for morphing photos: లోన్ యాప్ లకు సంబంధించిన అనేక దారుణాలు ఈ మధ్య వార్తలలో నిలుస్తున్నాయి. కొన్ని సంస్థలు వీటిని ఒక బిజినెస్ గా మలుచుకుంటున్నాయి. మొదట కస్టమర్ లకు అడిగినంతా రుణం ఇస్తున్నారు. దీనికోసం కస్టమర్ ల బంధువులు, స్నేహితుల నంబర్ లను షురీటీగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కస్టమర్ తీసుకున్న సొమ్ముకు వడ్డీలు పెంచుతూ.. చెల్లించాలంటూ పీడిస్తున్నాడు. ఒక వేళ ఏదైన కారణంతో వారు డబ్బులు చెల్లించడంలో ఆలస్యమైన, వారిని హింసిస్తున్నారు.
కొన్ని సార్లు.. కొందరు, కస్టమర్ ల బంధువులకు ఫోన్ చేసి.. డబ్బులు చెల్లించడం లేదంటూ, వీరి పరువును బజారుకు ఈడిస్తున్నారు. ఇప్పటికే లోన్ యాప్ ల, నిర్వాహకుల (recovery agent) ఆగడాలకు ఎంతో మంది సూసైడ్ చేసుకున్నారు. మరికొందరు.. తమ బంధువుల ఎదుట తెలెత్తుకోలేక తీవ్ర ఒత్తిడికి గురౌతున్నారు. కొందరు లోన్ తీసుకున్న వారి పట్ల అసభ్యంగా కూడా ప్రవర్తిస్తున్నారు. కొన్ని యాప్ నిర్వాహకులు లోన్ తీసుకున్న మహిళలకు (woman molested) ఫోన్ చేసి లైంగిక అవసరాలు తీర్చాలంటూ కూడా వేధిస్తున్నారు. మరికొందు మహిళల పట్ల అసభ్యంగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. ముంబైలో లోన్ యాప్ (mumbai)నిర్వాహకుల దారుణం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఒక యువతి లోన్ యాప్ నుంచి అవసరానికి డబ్బులు తీసుకుంది. దీనికోసం, బంధువులు, స్నేహితుల నంబర్ ఇచ్చింది. అయితే,కొన్ని కారణాల వలన ఆమె డబ్బులు చెల్లించడంలో విఫలమైంది. దీనితో డబ్బులు వసూలు చేసే రికవరీ ఏజెంట్ ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఆ యువతి ఫోటోలను అశ్లీల వీడియోలో మార్ఫింగ్ చేశాడు.
ఆ తర్వాత.. ఆ వీడియోను ఆమె బంధువులు, స్నేహితులకు పంపించాడు. ఈ క్రమంలో ఆ మహిళ బంధువుకు ఒక రోజు ఒక మార్పింగ్ అశ్లీల వీడియో వచ్చింది. దానిలో సదరు యువతి ఉంది. దానిలో లోన్ చెల్లించడంలో విఫలమై... సెక్క్ వర్కర్ గా మారిందంటూ.. అందులో ఆమె ఫోన్ నంబర్ కూడా ఉంది. దీంతో ఆమె షాక్ కు గురైంది. జరిగిన దారుణాన్ని యువతికి తెలిపింది. వెంటనే వారు సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోనికి దిగిన పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.