నడిరోడ్డుపై రచ్చ... భర్త బండారం బయటపెట్టిన భార్య... వైరల్ వీడియో...

తన భర్త ఎప్పటి నుంచో మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం ఉన్న ఆమె... నడిరోడ్డుపై మేటర్ తేల్చేసింది. ఇది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

news18-telugu
Updated: July 14, 2020, 10:19 AM IST
నడిరోడ్డుపై రచ్చ... భర్త బండారం బయటపెట్టిన భార్య... వైరల్ వీడియో...
నడిరోడ్డుపై రచ్చ... భర్త బండారం బయటపెట్టిన భార్య... వైరల్ వీడియో... (credit - twitter)
  • Share this:
అది ముంబైలోని బిజీ రోడ్లలో ఒకటి. శనివారం సాయంత్రం 5 గంటలైంది. సడెన్‌గా ఓ తెల్లటి కారు మరో బ్లాక్ SUV కారుకు అడ్డుగా వచ్చింది. దాంతో రెండు కార్లూ ఆగిపోయాయి. అడ్డుగా పెట్టిన కారులోంచీ దిగిన ఓ మహిళ... మరో కారు డోర్లను తియ్యాలని ప్రయత్నించింది. అవి రాలేదు. అందులో వారు బయటకు రాలేదు. దాంతో ఆ మహిళ కారు బానెట్ ఎక్కి... దాని అద్దంపై చెప్పుతో కొట్టింది. కేకలు పెట్టింది. దాంతో తీవ్ర కలకలం రేగింది. ప్రజలు తమాషా చూశారు. అటూ ఇటూ వాహనాలు ఆగిపోయి ట్రాఫిక జామ్ అయ్యింది. రంగంలోకి దిగిన పోలీసులు... ఆ మహిళను వారించారు. కారు దిగమన్నారు. ఆమె గట్టిగా అరుస్తూ... కారులో వాళ్లను దిగమని కేకలు వేసింది. ఇలా పెద్ద సీన్ క్రియేట్ అయ్యింది. దీనంతటికీ కారణం వివాహేతర సంబంధం.

తన భర్త ఎప్పటి నుంచో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆ మహిళకు అనుమానం కలిగింది. కానీ రెడ్ హ్యాండెడ్‌గా వాళ్లను పట్టుకోవాలి అని అనుకుంది. తాజాగా తన భర్త నల్ల కారులో వెళ్తుంటే... వెనకాలే ఫాలో అయ్యింది. మధ్యలో ఓ చోట కారు ఆపిన భర్త... ఓ మహిళను ఎక్కించుకున్నాడు. అంతే... అది చూసిన ఆమెకు సర్రున కాలింది. ఒక్కసారిగా యాక్సిలరేజర్ రైజ్ చేసింది. జామ్మని దూసుకెళ్లి... నడి రోడ్డుపై భర్త కారును అడ్డుకొని... రచ్చ రచ్చ చేసింది.ట్రాఫిక్ సరిచేసిన పోలీసులు ఆ రెండు కార్లను సైడ్‌కి ఆపమన్నారు. ఆ తర్వాత... భర్తపై కేసు పెడతారా అంటే... ఆమె అవసరం లేదంది. ఇక అతనితో తనకు సంబంధం లేదంది. పోలీసులు మరి ట్రాఫిక్ జామ్‌కి కారణమైనందుకు మీరు ఫైన్ కట్టాలి అన్నారు. ఫైన్ కట్టిన ఆమె... భర్తపై మండిపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. కానీ ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమెను ఇబ్బంది పెట్టిన ఆమె భర్తపై యాక్షన్ తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
Published by: Krishna Kumar N
First published: July 14, 2020, 10:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading