Home /News /crime /

MUMBAI WAITER STALKS AND MOLESTED HARASSES HIGH COURT LAWYER IN TRAIN HELD PAH

లోకల్ ట్రైన్ లో ఘోరం.. హైకోర్టు మహిళా జడ్జీకి లైంగిక వేధింపులు.. ఎక్కడంటే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mumbai: పనిమీద హైకోర్టుకు వెళ్తున్న మహిళా జడ్జీని ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను లోకల్ ట్రైన్ లో వెంబడించాడు. అంతటితొో ఆగకుండా..

  • News18 Telugu
  • Last Updated :
  • Mumbai, India
మహిళలపై అఘాయిత్యాలు, వేధింపుల ఘటనలు ప్రతిరోజు వార్తలలో ఉంటున్నాయి. గుడి, బడి, బస్టాండ్, రైల్వేస్టేషన్ ఇలా ప్రతిచోట మహిళలు వేధింపులకు గురౌతున్నారు. మహిళలు కన్పిస్తే చాలు.. కామాంధులు రెచ్చిపోతున్నారు. మాయమాటలు చెప్పి కొందరు, అవసరాల కోసం మరికొందరు మహిళలను శారీరక అవసరాల కోసం వాడుకుంటున్నారు. మరికొందరు మహిళలు ఒంటరిగా కన్పిస్తే చాలు.. లైంగిక వేధింపులకు (Harassment) పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల ప్రజలను కాపాడాల్సిన పోలీసులు కూడా వేధింపులకు పాల్పడుతున్నారు. కొందరైతే స్టేషన్ లోనే అత్యాచారాలకు దిగుతున్నారు. ఇలాంటి అనేక సంఘటనలు గతంలో జరిగాయి. అయితే.. నేరవిచారణ చేసి తగిన పనిష్మెంట్ ఇచ్చే న్యాయవాది కూడా వేధింపులకు గురైంది. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ముంబైలో (Mumbai)  దారుణ ఘటన జరిగింది. తన పనికోసం ముంబై హైకోర్టుకు వెళ్తున్న మహిళ జడ్జీని ఒక వ్యక్తి లైంగికంగా వేధించాడు. ఈ ఘటన శాంతాక్రూజ్, చర్చ్‌గేట్ స్టేషన్‌ల ప్రాంతంలో.. ఉన్న మధ్య లోకల్ రైలులో సంభవించింది. రైలులో వుమెన్ కంపార్ట్ మెంట్ లో ఎక్కిన మహిళను నీరాజ్ మియాన్ (33) వెంబడించాడు. ఆమె మహిళ కోచ్ లో ఎక్కింది.



అయిన కూడా వదిలిపెట్టలేదు. ఆమెను అనుసరించాడు. దీంతో ఆమె తన సహోద్యోగులకు తెలిపింది. దీంతో తర్వాతి స్టేషన్ లో చేరుకుని, అతడిని అదుపులోనికి తీసుకున్నారు. అతను స్థానికంగా ఉన్న హోటల్ లో వెయిటర్ గా పనిచేస్తున్నాడని పోలీసుల విచారణలో తెలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా ..  హర్యానాలోని (Haryana)  గురుగ్రామ్ లో అమానవీయకర సంఘటన జరిగింది. సోనాదేవీ, తన కొడుకు ప్రవేశ్ తో కలిసి ప్రవేశ్ సోనేపట్‌లోని జట్వాడ మొహల్లాలో నివాసం ఉంటున్నారు. సోనాదేవీ భర్త మరణించాడు. అయితే.. బాలుడు ప్రభుత్వ హస్టల్ ఉంటూ చదువుకుంటున్నారు. తల్లిమాత్రం.. ఒక ప్రైవేటు పాఠశాలలో వార్గెన్ గా పనిచేసింది. ఆ తర్వాత.. ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటుంది. ప్రవేవ్ ఇంటికి వచ్చినప్పుడు తన తల్లి పరాయి వ్యక్తితో ఎక్కువగా ఫోన్ లో మాట్లాడుతుండటం గమనించాడు. దీంతో తల్లికి పలుమార్లు హెచ్చరించాడు.

క్రమంలో పద్ధతి మార్చుకోని తల్లి.. ఎఫైర్ కొనసాగిస్తు వచ్చింది. ఒక రోజు బాలుడు ఉన్నట్లుండి ఇంటికి వచ్చాడు. అప్పుడు.. ఇంట్లో మరోక వ్యక్తితో తల్లి.. అభ్యంతరకర రీతిలో ఉండటాన్ని గమనించాడు. వెంటనే కోపంతో ఊగిపోయాడు. ఆవేశం పట్టలేక..తన తల్లిని అక్కడ ఉన్న కత్తి తీసుకుని పలుమార్లు పొడిచి చంపాడు. ఆ తర్వాత.. శవాన్ని మంచం కింద సంచిలో పెట్టేశాడు. ఇంట్లో నుంచి భరించలేని దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Mumbai

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు