MUMBAI TV ACTRESS FILED A CASE AGAINST A PERSON WHO RAPED HER MULTIPLE OCCASIONS ON THE PRETEXT OF MARRIAGE HSN
పెళ్లి చేసుకుంటానంటూ మాయమాటలతో మోసం.. పలుమార్లు అత్యాచారం.. ప్రముఖ వ్యక్తిపై కేసు పెట్టిన టీవీ నటి..!
(ప్రతీకాత్మక చిత్రం - image credit - youtube)
స్త్రీలపై అత్యాచారాలకు అంతే లేకుండా పోతోంది. దిశ, నిర్భయ వంటి చట్టాలు వచ్చినా స్త్రీలపై జరుగుతున్న దాడులు మాత్రం ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా ఓ ప్రముఖ వ్యక్తి పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి ఓ సినీ నటిపై పలుమార్లు అత్యాచారం చేశాడు.
ప్రతీ రోజూ ఏదో ఒక మూల మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. స్త్రీలపై అత్యాచారాలకు అంతే లేకుండా పోతోంది. దిశ, నిర్భయ వంటి చట్టాలు వచ్చినా స్త్రీలపై జరుగుతున్న దాడులు మాత్రం ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ప్రేయసి మోజులో పడి భార్యలను భర్తలు హతమార్చడమో, ప్రేమించలేదన్న కారణంతో ప్రియుడి రూపంలో యువకులు రెచ్చి పోవడమో జరుగుతోంది. పాఠశాలల్లో ఉపాధ్యాయుల రూపంలో, కాలేజీల్లో స్నేహితులు, లెక్చరర్ల రూపంలో, ఆఫీసుల్లో కొలీగ్స్ రూపంలో కామాంధులు పొంచి ఉన్నారు. చివరకు సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కూడా స్త్రీకి రక్షణ లేకుండా పోతోంది. తాజాగా ఓ ప్రముఖ వ్యక్తి పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి ఓ సినీ నటిపై పలుమార్లు అత్యాచారం చేశాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మహారాష్ట్రలోని ముంబైలో ఓ టీవీ నటి సీరియల్స్ లోనూ, సినిమాల్లోనూ నటిస్తూ జీవిస్తోంది. ఆమెకు కొంత కాలంగా ఓ ప్రముఖ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆమెతో చాలా సన్నిహితంగా మెలిగాడు. పెళ్లి చేసుకుందామంటూ, సంతోషంగా జీవించవచ్చంటూ ఆమెకు మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఆ తర్వాత పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. పెళ్లి గురించి ప్రస్తావించిన ప్రతీ సారీ ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునేవాడు. మాట మార్చేవాడు. చివరకు మోసపోయానని గ్రహించిన ఆమె తీవ్ర మనస్థాపానికి గురయింది.
తనలాగా మరెవరూ మోసపోకూడదని ఆ టీవీ నటి నిర్ణయించుకుంది. అతడి నిర్వాకంపై, అతడి బాగోతాలపై ముంబైలోని ఓషీవరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఆమె ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నామనీ, త్వరలోనే ఈ విషయంలో ఆమెకు న్యాయం చేస్తామని పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు.