Home /News /crime /

MUMBAI TEEN BOOKED FOR MOLESTING ASSAULTING FELLOW INMATE IN ARTHUR ROAD JAIL PAH

OMG: ఛీఛీ.. జైలులో ఇదేం యవ్వారం... అత్యాచార నిందితుడిపై.. తోటి ఖైదీ రేప్.. ట్విస్ట్ ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mumbai: జైలులో నిందితుడు మరో ఖైదీని వేధింపులకు గురిచేశాడు. అతని పట్ల అసహజంగా ప్రవర్తించాడు. దీంతో అతను తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు.

ఎవరైన తప్పులను చేస్తే వారిని కోర్టులో ప్రవేశపెడతారు. కోర్టువారిని విచారించి చేసిన నేరానికి తగ్గట్టుగా శిక్ష విధిస్తుంది. ఇక్కకో నిందితుడిని జైలులో పెడితే మారతాడనుకున్నారు. కానీ అతను మారకపోగా.. అక్కడ కూడా మరో నీచమైన పనికి పాల్పడ్డాడు. చాలా మంది జైలులో శిక్ష కాలంలో చేసిన తప్పులు పశ్చాత్తపం పడుతుంటారు. వీరిలో మార్పువస్తుంది. క్షణికావేశంలో ఎంత తప్పుడు చేశామని కుమిలిపోతుంటారు. తమ వారికోసం ప్రతి క్షణం ఆలోచిస్తు ఉంటారు. మరికొందరు దీనికి భిన్నంగా ఉంటారు. జైలులో కూడా తమ వంకర బుద్ది మార్చుకోరు. అక్కడ కూడా మరి కొందరితో కలిసి చెడ్డ పనులను నేర్చుకుంటారు.

తమ వంకర బుద్ధిని మార్చుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయరు. ప్రస్తుతం కొందరు అత్యంత నీచంగా ప్రవర్తిస్తున్నారు. పశువుల కన్నా హీనంగా వ్యవహరిస్తున్నారు. కొందరు కుక్కలు, ఆవులు, గేదెల పట్ల అసహజంగా ప్రవర్తిస్తున్నారు. వాటిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. మరి కొందరు పురుషులు, మరో పురుషుడితోనే అసహజంగా లైంగిక చర్యలో పాల్గొంటున్నారు. బెదిరిస్తు అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఒక యువకుడు.. చేసిన తప్పుకు జైలులో శిక్షను అనుభవిస్తూనే.. మరో నీచమైన పనికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ముంబైలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఆర్థర్ రోడ్ లో ఉన్న జైలులో ఒక యువకుడు అత్యాచారం నేరం క్రింద జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.ఈ క్రమంలో అతను జైలులో ఉన్న తన పాడు బుద్ధి మానుకోలేక పోయాడు. కొన్ని రోజులుగా తోటీఖైదీని లైంగికంగా వేధిస్తున్నాడు. అతని పట్ల అసహజంగా ప్రవర్తిస్తున్నాడు.

బాధితుడు కూడా అత్యాచారం చేసిన ఘటనలోనే శిక్ష అనుభవిస్తున్నాడు. దీంతో బాధితుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. జైలులోని పోలీసులకు జరుగుతున్న దారుణాన్ని తెలిపాడు. వారు పట్టించుకోలేదు. దీంతో అతను.. జైలు అధికారులతో తన గొడును వెల్లబోసుకున్నాడు. దీంతో అధికారులకు పోలీసులుకు నోటీసులు జారీ చేశారు. జైలులో అత్యాచారానికి పాల్పడిని నిందితుడిపై మరిన్ని కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అధికారులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Jails, Man harassed, Mumbai

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు