Home /News /crime /

MUMBAI TALOJA JAIL INMATES APPROACH COURT OVER MOSQUITO MENACE PAH

సార్... మా దోమ తెరలను పోలీసులు దొంగిలించారు.. కోర్టుల కెక్కిన ఖైదీలు.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mumbai Taloja jail: దోమల కుట్టడంతో తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నామని, వెంటనే తమకు ప్రత్యామ్నాయ సౌకర్యాలు కల్పించాలని ఖైదీలు కోర్టుల కెక్కారు.

కొందరు అనుకొకుండా క్షణికావేశంలో తప్పులు చేసి జైలులో శిక్షలు అనుభవిస్తుంటారు. వారు కూడా మనలాంటి సామాన్య వ్యక్తులే. కానీ కొందరు మాత్రం తీవ్రమైన నేరాలు చేసి జైలులో శిక్షలు అనుభవిస్తుంటారు. కొందరు దొంగతనం చేసి జైలుకు వెళ్తుంటారు. మరికొందరు కోపంలో ఇతరులను హత్యచేసి జైలుకు వెళ్తారు. అయితే, జైలులో ఉన్నప్పటికి వారికంటూ కొన్ని హక్కులు ఉంటాయి. అధికారులకు వారికి కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంటారు. అయితే,కొన్ని జైళ్లలో మాత్రం సరైన సదుపాయాలు ఉండవు. ఖైదీలు తీవ్ర ఇబ్బందులకు గురౌతుంటారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ముంబైలోని  తలోజా జైలులో (Mumbai Taloja jail) కొంత మంది ఖైదీలు కోర్టుల కెక్కారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది. కొన్ని రోజులుగా జైలులో అసలు శుభ్రతను పాటించడం లేదని, దీంతో తీవ్ర అసౌకర్యానికి గురౌతున్నామని ఖైదీలు జైలు అధికారుల ఎదుట మోత్తుకున్నారు. అంతే కాకుండా.. తమకు దోమలు (mosquito menace) బెడద ఎక్కువగా ఉందని, చాలా మందికి డెంగ్యూ, మలేరియా సోకిందని అన్నారు. రానున్న వర్షకాలంలో మరింత ఎక్కువగా అయ్యే ప్రమాదం ఉందని ఖైదీలు వాపోయారు. అధికారులు పట్టించుకొక పోవడంతో ఏకంగా ఖైదీలు కోర్టులకెక్కారు.



కొంత మంది ఖైదీలు ముంబైలోని ఖర్ఘర్‌లోని పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. తమ దోమ తెరలను కొంత మంది పోలీసులు దొంగిలించారని అన్నారు. దోమ తెరల ధర సుమారు 620 ఉంటుదని అన్నారు. తమకు దొమతెరలు ఏర్పాటు చేయాలని బాధిత ఖైదీలు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు విచారణకు ఆదేశించింది.

ఘటనపై పోలీసుల వాదన మరోలా ఉంది. దోమతెరల దారాలు బలంగా ఉంటాయి. దీంతో ఖైదీలు ఒకరిపై మరోకరు దాడిచేసుకునే ప్రమాదం ఉందని, ఉరివేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే, వెంటనే జైళ్లలో కాయిల్స్ , దొమలను దూరం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని కోర్టు వారు, పోలీసులను ఆదేశించింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో (Viral news)  వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Mosquito, Mumbai, VIRAL NEWS

తదుపరి వార్తలు