TRP scam: టీఆర్పీ రేటింగ్ స్కామ్‌లో మాస్టర్‌మైండ్‌గా బార్క్ మాజీ సీఈఓ పేరు

టీఆర్పీ రేటింగ్ స్కామ్‌లో మాస్టర్‌మైండ్‌గా బార్క్ మాజీ సీఈఓ పార్థో దాస్ గుప్తా (File Image)

TRP scam: CNN-న్యూస్ 18 సహా... చాలా ఛానెళ్ల రేటింగ్‌ను తగ్గించడంలో బార్క్ (BARC) మాజీ CEO పార్థో దాస్ గుప్తా కీలక పాత్ర పోషించినట్లు తేలుతోంది.

  • Share this:
    TRP scam: ఒక్క ఛానెల్‌కి రేటింగ్స్ పెంచడం కోసం CNN-న్యూస్ 18 సహా చాలా ఛానెళ్ల రేటింగ్స్ తగ్గిస్తూ... టీఆర్పీ రేటింగుల ట్యాంపరింగ్‌కి పార్పడినట్లు బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (BARC) మాజీ సీఈఓ పార్థో దాస్‌ గుప్తా (Partho Dasgupta)ను ఈ కేసులో కీలక సూత్రధారి (mastermind)గా భావిస్తూ ఆయన పేరును చేర్చారు ముంబై పోలీసులు. ఈయన కొన్ని ఛానెళ్ల టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (TRP)ని కావాలనే రిగ్గింగ్ చేసి... తగ్గించేసినట్లు ఆరోపణలు భగ్గుమంటున్నాయి. ప్రధానంగా ఒక్క న్యూస్ ఛానెల్ కోసం మిగతా ఛానెళ్ల రేటింగ్స్ తగ్గించేయడం అనే భారీ కుట్రకు పార్థో దాస్ గుప్తా పాల్పడినట్లు ఈ కేసులో ఆధారాలు లభిస్తున్నాయి.

    పుణు జిల్లా... రాజ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌కి చెందినక్రైమ్ ఇంటెలిజనెస్ యూనిట్ (CIU) పార్థో దాస్ గుప్తాను అరెస్టు చేసింది. ఆయన్ని ఇవాళ ముంబై కోర్టులో హాజరు పరచబోతోంది. దాస్ గుప్తా... 2013-2019 మధ్య బార్క్ సీఈఓగా పనిచేశారు. ఈ కేసులో ఈయనజి 15వ అరెస్టు. డిసెంబర్ 28 వరకూ ఈయన కస్టడీలో ఉండనున్నారు.

    "ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టులో కొన్ని విషయాలు తెలిశాయి. మాజీ ఉన్నతాధికారుల మధ్య కొన్ని ఈ మెయిల్స్, చాట్స్ జరిగాయి." అని డిసెంబర్ 25న ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు. సింగ్ ఆ ఉన్నతాధికారుల మధ్య చాట్స్‌కి సంబంధించిన ఓ విషయాన్ని చదివారు. "దయచేసి ఓ వారం పాటూ ఆ ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్‌ కోసం కింద ఉన్న అప్‌డేట్ చూడండి. టైమ్స్ నౌ, CNN-న్యూస్ 18వి మార్చండి" అని చాటింగ్ జరిగినట్లు తెలిపారు.

    ఇది కూడా చదవండి:Hanuman in Tree: చెట్టులో కనిపించిన ఆంజనేయ స్వామి. తరలివస్తున్న భక్తులు

    "ఆయన (దాస్ గుప్తా)... సీఈఓగా చేశారు కాట్టి... ఆయన టీఆర్పీ రేటింగ్స్‌లో మానిప్యులేషన్ చేసి ఉంటారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ఛానెళ్ల ఓనర్లు, విజిల్ బ్లోయర్లూ ఈ ఆరోపణలు చేశారు. థర్డ్ పార్టీ ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టను 2020 జులైలో సమర్పించింది. దానిపై మేం బార్క్ (BARC)తో మాట్లాడి ఓ రిపోర్ట్ రెడీ చేసుకున్నాం" అని పరమ్ బీర్ సింగ్ తెలిపారు.

    "రిపోర్ట్ ప్రకారం 44 వారాల డేటాను విశ్లేషించారు. ముఖ్యంగా ఇంగ్లీష్, తెలుగు ఛానెళ్లలో పరిశీలించారు. వాటి విషయంలో ఈ మానిప్యులేషన్ జరిగింది. మూడు రకాల పద్ధతుల్లో ఇది జరిగింది. కొన్ని సందర్భాల్లో రేటింగ్స్ ముందుగానే డిసైడ్ చేశారు. బార్క్ లోని కొందరు మాజీ అధికారుల పాత్ర ఇందులో ఉందని రిపోర్ట్ తెలిపింది"అని పరమ్ బీర్ సింగ్ వివరించారు. "బార్క్ మాజీ ఉద్యోగులపై దర్యాప్తు కొనసాగుతోంది. చట్ట బద్ధ సంస్థలకు బార్క్ నిర్వహణాధికారులు తమ సహకారం అందిస్తున్నారు."

    "బార్క్ లోని ప్రతి ఉద్యోగీ నియమ బద్ధంగా నడుచుకోవాలి. ఎథిక్స్ పాటించాలి. తప్పుచేస్తే క్రమశిక్షణా చర్యలు ఉంటాయి" అని బార్క్ ప్రతినిధి ఒకరు తెలిపారు. "మేం భారతీయులు ఏం చూస్తున్నారో సరైన రిపోర్ట్ ఇవ్వాలి. అది మా బాధ్యత." అని ఆయన తెలిపారు.

    ఇది కూడా చదవండి:Baba Vanga Predictions: 2021 మరింత ప్రమాదకరం. బాబా వంగా జ్యోతిష అంచనాలు

    దాస్ గుప్తాకి ముందు... బార్క్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) రామిల్ రామ్‌ఘరియా కూడా అరెస్ట్ అయ్యారు. పోలీసుల ప్రకారం... హన్సా గ్రూప్‌లోని రిలేషన్‌షిప్ మేనేజర్లు... మ్యానిప్యులేషన్లు చెయ్యడానికి ప్రజలకు డబ్బులు ఇచ్చారు. ఈ హన్సా గ్రూప్ ఓ మార్కెట్ రీసెర్చ్ సంస్థ. దీన్ని బార్క్ నియమించుకుంది. ఇది ఇళ్లలో టీవీ ఛానెల్స్ చూస్తున్న వారికి సెట్ చేసిన బారోమీటర్లను చెక్ చేసి... వ్యూవర్‌షిప్ డేటాను తెస్తుంది. ఐతే... వారు ఫలానా ఛానెలే చూడాలని నెలకు రూ.500 చొప్పున ఇచ్చినట్లు తెలిసింది. ఇలా చెయ్యడం వల్ల ప్రత్యేక ఛానెల్స్ రేటింగ్ పెరగగా... మిగతా ఛానెళ్ల రేటింగ్స్ అక్రమంగా పడిపోయాయి.
    Published by:Krishna Kumar N
    First published: