హోమ్ /వార్తలు /క్రైమ్ /

Porn apps: పోర్న్ కోసం ప్రత్యేక యాప్స్.. సెల్ ఫోన్లతో షూట్ చేస్తూ ల్యాప్ టాప్ తో అప్ లోడ్.. పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు

Porn apps: పోర్న్ కోసం ప్రత్యేక యాప్స్.. సెల్ ఫోన్లతో షూట్ చేస్తూ ల్యాప్ టాప్ తో అప్ లోడ్.. పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చాలా తక్కువ ఖర్చుతోనే పోర్న్ సినిమాలు తీస్తూ వాటిని యాప్స్ లో అప్ లోడ్ చేస్తూ క్యాష్ చేసుకుంటున్న ఈ రాకెట్ ని ముంబై పోలీసులు తాజాగా పట్టుకున్నారు. నటి గెహనా వశిష్ట్ తో పాటు మరికొందరు ఈ సినిమాలకు ప్రొడ్యూసర్లు గా వ్యవహరిస్తూ వాటిని వివిధ యాప్స్ కి అమ్ముతున్నట్లు గుర్తించారు.

ఇంకా చదవండి ...

యువతలో సెక్స్ పట్ల ఉన్న ఆసక్తి ని క్యాష్ చేసుకుంటూ పోర్న్ సినిమాలను తీస్తూ సొమ్ము చేసుకుంటోంది ముంబైకి చెందిన ఓ ముఠా. చాలా తక్కువ ఖర్చుతోనే పోర్న్ సినిమాలు తీస్తూ వాటిని యాప్స్ లో అప్ లోడ్ చేస్తూ క్యాష్ చేసుకుంటున్న ఈ రాకెట్ ని ముంబై పోలీసులు తాజాగా పట్టుకున్నారు. నటి గెహనా వశిష్ట్ తో పాటు మరికొందరు ఈ సినిమాలకు ప్రొడ్యూసర్లు గా వ్యవహరిస్తూ వాటిని వివిధ యాప్స్ కి అమ్ముతున్నట్లు గుర్తించారు. ముంబైకి చెందిన ఈ గ్యాంగ్ డబ్బు చాలా అవసరమున్న అమ్మాయిలకు ఎర వేసి వారితో అరగంట నిడివి గల పోర్న్ సినిమాలను రూపొందిస్తున్నారు. ఈ పోర్న్ సినిమాలను వివిధ పోర్న్ యాప్స్ కి అమ్ముతున్నారు. ఈ పోర్న్ యాప్స్ అచ్చం ఓటీటీ ప్లాట్ ఫాంలలాగే సబ్ స్క్రిప్షన్ కోసం డబ్బులు కట్టించుకొని నెలంతా ఉచితంగా పోర్న్ వీడియోలు చూసే సదుపాయాన్ని కల్పిస్తాయి. ఇలాంటివి మొత్తం 12 యాప్స్ ని గుర్తించారు ముంబై పోలీసులు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చాలా పోర్న్ వెబ్ సైట్లు, దొంగతనంగా సినిమాలు విడుదల చేసే వెబ్ సైట్లను ఐటీ శాఖ బ్లాక్ చేసింది. అయితే ఆ తర్వాత పోర్న్ వెబ్ సైట్ల హవా ముగియడంతో చాలామంది పోర్న్ యాప్స్ ని ప్రారంభించారు.

ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ఇలాంటి యాప్స్ చాలా తయారయ్యాయి. వీటిలో కొన్ని యాప్స్ కైతే దాదాపు కోటికి పైగా సబ్ స్క్రైబర్లు ఉండడం విశేషం. ఈ యాప్స్ ఒక్కొక్కరి నుంచి నెలకు రూ.199 లను వసూలు చేస్తున్నాయి. ఇలా మొత్తంగా చూస్తే వీరి ఆదాయం నెలకు రూ. 2 కోట్లకు మించుతోంది. ఇక పోర్న్ సినిమాలు తీసేందుకు కెమెరాలకు బదులుగా మంచి క్వాలిటీ ఉన్న ఫోన్ వాడడం, వాటిని తమ ల్యాప్ టాప్ లోనే ఆన్ లైన్ లో ఉచితంగా లభించే సాఫ్ట్ వేర్స్ తో ఎడిట్ చేయడం వంటివి చేస్తూ వారానికి రెండు నుంచి మూడు సినిమాలు రూపొందిస్తున్నారు. వీరి సంఖ్య కూడా నాలుగు నుంచి ఏడు వరకే ఉండడంతో చాలా తక్కువ ఖర్చుతో ఈ సినిమాలు రూపొందుతున్నాయి.

ఈ షూటింగ్ లను నిర్వహించేందుకు ముంబై శివార్లలో ఉన్న బంగ్లాలను రోజుకు పదివేల రూపాయల చొప్పున అద్దెకు తీసుకుంటున్నారు. నటి, నటులకు ఒక్కొక్కరికి రోజుకు రూ. 10,000 ఇస్తున్నారు. స్క్రిప్టు, డైలాగ్స్ వారే సొంతంగా రాసుకుంటున్నారని పోలీసులు వెల్లడించారు. మధ్ ఏరియాలో షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో రైడ్ చేసినప్పుడు కేవలం రెండు పేజీల స్క్రిప్ట్ పోలీసులకు దొరికింది. ఇందులో కొందరికి బాలీవుడ్ లో చిన్న చిన్న సినిమాల్లో పని చేసిన అనుభవం ఉందని వారంతా ముంబై కి చెందిన వారేనని వెల్లడించారు. ఇక నటీనటుల్లో కొందరిని ఇవి పూర్తి చేస్తే బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు అందిస్తామని మోసం చేసి సినిమాలు షూట్ చేస్తే.. మరికొందరు డబ్బు అత్యవసరమైన వ్యక్తులను గుర్తించి వారిని ఈ సినిమాల్లో నటించేలా చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

సినిమాలు రూపొందిన తర్వాత యాప్స్ లో ఈ కంటెంట్ ని అప్ లోడ్ చేస్తున్నారు. వీటికి సంబంధించి కొన్ని ఫేక్ సోషల్ మీడియా పేజీలు క్రియేట్ చేసి వాటిలో యాప్ లింక్స్ తో పాటు చిన్న క్లిప్పింగ్స్ పోస్ట్ చేస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను ఉపయోగించి తమ యాప్స్ గురించి ఎక్కువ మందికి తెలిసేలా చేస్తున్నారట. ఈ యాప్స్ ఓటీటీల్లా పని చేస్తూ వీక్లీ షోలను కూడా అందిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు.  సుప్రీం కోర్ట్ గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం మన దేశంలో పోర్న్ చిత్రాలు ప్రసారం చేసే వెబ్ సైట్లన్నీ బ్లాక్ చేయబడ్డాయి. ఆ తర్వాత కూడా ఇలాంటి చిత్రాలను ఎవరైనా ప్రసారం చేస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లోని సెక్షన్ 67 (A) (సెక్సువల్ కంటెంట్ ని పబ్లిష్ చేయడం లేదా ప్రసారం చేయడం, ఇతరులకు అందేలా చేయడం వంటివి చేసినందుకు శిక్షించే చట్టం) ప్రకారం ఐదేళ్ల వరకూ జైలు శిక్ష విధించే వీలుంటుంది.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Mumbai crime, Mumbai Police, Porn ban, Porn Movies, Sex Racket

ఉత్తమ కథలు