• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MUMBAI POLICE HAS ARRESTED ACTRESS AND MODEL GEHANA VASISTH FOR HER ALLEGED ROLE IN SHOOTING AND UPLOADING PORN VIDEOS SSR

ముంబైలో బయటపడ్డ ‘పోర్న్’ బాగోతం.. ఆ సీన్లలో నటిస్తూ అడ్డంగా దొరికిపోయిన నటి

ముంబైలో బయటపడ్డ ‘పోర్న్’ బాగోతం.. ఆ సీన్లలో నటిస్తూ అడ్డంగా దొరికిపోయిన నటి

గెహనా వశిష్ట (ఇన్‌స్టాగ్రామ్ ఫొటో)

దేశ ఆర్థిక రాజధానిగా పిలుచుకునే ముంబైలో అభివృద్ధితో పాటు అశ్లీలత కూడా రోజురోజుకూ పెరుగుతోంది. సినిమాల్లో నటించాలనే ఆశతో ముంబైకు వచ్చే వారిలో కొందరు ఆ కల నెరవేరకపోవడంతో తప్పుదోవలో ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్నారు. తాజాగా.. ముంబైలో ఈ తరహా ఘటనే ఒకటి వెలుగుచూసింది. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి ఆ తర్వాత...

  • Share this:
    ముంబై: దేశ ఆర్థిక రాజధానిగా పిలుచుకునే ముంబైలో అభివృద్ధితో పాటు అశ్లీలత కూడా రోజురోజుకూ పెరుగుతోంది. సినిమాల్లో నటించాలనే ఆశతో ముంబైకు వచ్చే వారిలో కొందరు ఆ కల నెరవేరకపోవడంతో తప్పుదోవలో ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్నారు. తాజాగా.. ముంబైలో ఈ తరహా ఘటనే ఒకటి వెలుగుచూసింది. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి ఆ తర్వాత టెలివిజన్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి గెహనా వశిష్ట నీలి చిత్రాల్లో నటిస్తూ.. ఆ వీడియోలను తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి సొమ్ము చేసుకుంటున్నట్లు తేలడంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇలాంటి వీడియోల్లో ఇంకొంత మంది మోడల్స్ కూడా నటించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నీలిచిత్రాలను గుట్టుచప్పుడు కాకుండా నిర్మించే నిర్మాణ సంస్థలు కూడా ఉన్నట్లు తెలిసింది. వాళ్లే ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి వీడియోలను ఎడిట్ చేసి వెబ్‌సైట్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్లు విచారణలో తేలింది.

    గెహనా వశిష్టకు సంబంధించి మొత్తం 87 పోర్న్ వీడియోలు ఉన్నాయని, వాటిని వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ వీడియోలను వీక్షించాలంటే సబ్‌స్క్రిప్షన్ ఫీజు కింద రూ.2000 చెల్లించాలని వెబ్‌సైట్‌లో డబ్బు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ‘గంధీ బాత్’ అనే హిందీ అడల్ట్ వెబ్ సిరీస్‌లో కూడా గెహనా నటించింది. అంతేకాదు, ‘మిస్ ఏషియా బికీనీ’ టైటిల్‌ను కూడా ఆమె సొంతం చేసుకుంది. హిందీ, తెలుగులో పలు వ్యాపార ప్రకటనల్లో గెహనా నటించింది. నీలి చిత్రాలు అప్‌లోడ్ చేసిన కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆదివారం గెహనాను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

    ముంబైలోని పలు రహస్య ప్రదేశాల్లో నీలి చిత్రాలను చిత్రీకరించి.. వాటిని వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేసి సొమ్ము చేసుకునే నిర్మాణ సంస్థల గురించి తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. సినిమాల్లో ఛాన్స్‌లిప్పిస్తామని ఆశ చూపి, అలా నమ్మి వచ్చిన యువతులతో ‘పోర్న్’ చిత్రాలను చిత్రీకరిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని, అలా మోసపోయిన ముగ్గురు యువతులు ఇచ్చిన ఫిర్యాదుతో గ్రీన్ పార్క్ బంగళాలో రైడ్స్ చేయగా ఈ బాగోతం బయటపడినట్లు పోలీసులు చెప్పారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు