CRIME : బాధ్యతగా వ్యవహరించాల్సిన వాడే దారి తప్పాడు. అభం శుభం తెలియని 13 ఏళ్ల బాలికపై కన్నేశాడు. చివరికి అతగాడి వికృతి చేష్టలకు తగిన శాస్తి జరిగింది. ఇంతకీ ఏం జరిగిదంటే...
బాధ్యతగా వ్యవహరించాల్సిన వాడే దారి తప్పాడు. అభం శుభం తెలియని 13 ఏళ్ల బాలికపై కన్నేశాడు. చివరికి అతగాడి వికృతి చేష్టలకు తగిన శాస్తి జరిగింది. అసలు ఏం జరిగిదంటే.. ముంబైలో విలే పార్లేకి చెందిన 28 ఏళ్ల కానిస్టేబుల్ ఎనిమిదో తరగతి చదువుతున్న చిన్నారిపై కన్నేశాడు. ఎవరూ లేని సమయంలో ఆ చిన్నారిని తన ఇంటికి రమ్మని బెదిరింపులకు దిగేవాడు. ఇలా ప్రతి రోజూ ఆ మైనర్ బాలికను వేధింపులకు గురి చేసేవాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడు.
" విలే పార్లేకి చెందిన కానిస్టేబుల్.. తన ఇంటి పక్కనే ఉన్న 13 ఏళ్ల బాలికను రోజూ వేధించేవాడు. ఎవరూ లేని సమయంలో ఇంటి రమ్మని బెదిరించేవాడు. ఇలా రోజు జరుగుతున్న భయంతో ఆ మైనర్ బాలిక తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేదు. కానీ, చుట్టు పక్కల ఉన్న వారు ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలిపారు. ఈ విషయం నిజమని నిర్థారించుకున్న తర్వాత ఆ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఆ కీచకుడి మీద ఫిర్యాదు చేశారు " అని ముంబై పోలీసులు వెల్లడించారు.
పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు.. ఆ కీచక కానిస్టేబుల్ ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. అధికారం ఉందని ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే చర్యలు తప్పవని ముంబై పోలీసులు హెచ్చరించారు.