మహిళలపై అఘాయిత్యాలకు, వేధింపులకు పాల్పడేవారి కోసం ఎన్ని కఠినా చట్టాలు తీసుకొచ్చిన వారిలో మార్పు రావడం లేదు. కొందరు పోకిరిలు మహిళలను లైంగిక వేధించడమే పనిగా పెట్టుకుంటున్నారు. అలాంటి ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. 30 ఏళ్ల కల్పేష్ దేవ్ధారే అనే డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నార్త్ ముంబైలోని చార్కోప్ ప్రాంతంలో నివసస్తున్నాడు. అతడిపై మొత్తం 12 కేసులు నమోదయ్యాయి. వాటిలో 9 కేసులు మహిళలను వేధింపులకు గురిచేయడం, వారితో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు నమోదైనవే. అయితే డిసెంబర్ 11న మలాడ్ తూర్పు ప్రాంతానికి చెందిన ఓ యువతి నవ్జాలా పాడా ప్రాంతంలోని మార్కెట్‌కు వచ్చింది. అక్కడ ఆ యువతితో కల్పేష్ అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెను అడ్డగించడంతోపాటు దాడి కూడా చేశాడు. అంతటితో ఆగకుండా ఆమెను బలవంతంగా కౌగిలించుకున్నాడు.
ఈ ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన దిందోష్ పోలీసులు ఆ మార్కెట్ సమీప ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అలాగే పాత రికార్డులను వెరిఫై చేసి నిందితుడిని గుర్తించారు. అతని కోసం గాలింపు చేపట్టిన పోలీసులు కండివాలి నుంచి కల్పేష్ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం అతన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అతనిపై గతంలో కూడా కేసులు నమోదయ్యాయని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అందులో చాలావరకు మహిళలపై వేధింపులకు పాల్పడినవేనని చెప్పారు.
కల్పేష్ నేర చరిత్ర పెద్దదిగా ఉండే అవకాశం ఉందని.. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు. అతని చేత వేధించబడిన బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆ పోలీసు అధికారి కోరారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.