రేపిస్ట్‌ని పట్టించిన టీ షర్ట్.. చిన్నారిని చిదిమేసిన కిరాతకుడిని..

వడాలా ప్రాంతంలో అదే టీ షర్ట్‌ని ధరించిన ఓ వ్యక్తి కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. తమదైన స్టైల్లో ట్రీట్‌మెంట్ ఇవ్వడంతో అసలు విషయాన్ని చెప్పి నేరాన్ని ఒప్పుకున్నాడు.

news18-telugu
Updated: November 12, 2019, 6:30 PM IST
రేపిస్ట్‌ని పట్టించిన టీ షర్ట్.. చిన్నారిని చిదిమేసిన కిరాతకుడిని..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పదేళ్ల చిన్నారిని ఓ కిరాతకుడు రేప్ చేసి హత్య చేశాడు. అమాయక మూగ బాలికను ఆ రాక్షసుడు చిదిమేశాడు. ముంబైలోని సోనాపూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబరు 5న ఆ చిన్నారి తప్పిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు పోలీసులు. ఈ క్రమంలో శనివారం విద్యావిహార్ రైల్వేస్టేషన్‌లో చిన్నారి మృతేదేహం లభ్యమైంది. దాంతో రైల్వే స్టేషన్‌ చుట్టు పక్కల ఉన్న సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. నీలం రంగు టీ షర్ట్ ధరించిన ఓ వ్యక్తి ఆ బాలికను తీసుకెళ్లినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డయింది. దృశ్యాల్లో అతడి ముఖం మాత్రం స్పష్టంగా కనిపించలేదు. ఐతే అతడు ధరించిన నీలం రంగు టీషర్ట్‌పై స్వాగ్ అనే పదం ఉంది. పోలీసుల ముందు ఉన్న క్లూ అదొక్కటి మాత్రమే. దాని ఆధారంగానే దర్యాప్తు చేపట్టారు.

వడాలా ప్రాంతంలో అదే టీ షర్ట్‌ని ధరించిన ఓ వ్యక్తి కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. తమదైన స్టైల్లో ట్రీట్‌మెంట్ ఇవ్వడంతో అసలు విషయాన్ని చెప్పి నేరాన్ని ఒప్పుకున్నాడు. విచారణలో నిందితుడి నుంచి కీలక వివరాలు రాబట్టారు పోలీసులు. చిన్నారిని తీసుకెళ్తున్న క్రమంలో ఆమె ప్రతిఘటించినప్పటికీ.. మాటలు రాకపోవడంతో ఎవరూ గుర్తించలేదు. తెలిసిన వ్యక్తే అయి ఉంటాడని అందరూ భావించారు. అనంతరం రైల్వే స్టేషన్ సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, హత్య చేశాడు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో అతడిని కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు.

First published: November 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading