Home /News /crime /

MUMBAI POLICE ARREST THREE PERSONS FOR CHEATING SHOPKEEPER BY USING FAKE PAYTM APPS SK

Fake Paytm: పేటీఎంతో డబ్బు పంపిస్తారు.. కానీ మనకు రావు.. నకిలీ యాప్‌తో మోసాలు.. మీరే చూడండి..

Online Pay Scams: పేటీఎం స్పీకర్ లేని దుకాణాల్లోనే మోసాలకు పాల్పడుతారు. ఒకసారి మాత్రం నిజంగానే పేమెంట్ చేసి.. ఆ దుకాణం పేరు వంటి వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత డమ్మీ పేటీఎం యాప్ ఉపయోగించి.. ఆ షాప్ పేరు, డబ్బులు ఎంటర్ చేసి.. డబ్బులు పంపినట్లుగా ఓ సందేశాన్ని చూపిస్తారు.

ఇంకా చదవండి ...
  ఐదంతస్తుల షాపింగ్ మాల్‌కు వెళ్లినా.. ఫుట్‌పాత్ పక్కన పండ్ల బండి వద్దకు వెళ్లినా.. ఇప్పుడు అంతటా డిజిటల్ లావాదేవీలే జరుగుతున్నాయి. క్యూర్ కోడ్ స్కాన్ చేయడం..డబ్బులు పంపించడం.. ఇప్పుడంతా ఇదే నడుస్తోంది. పేటీఎం(PayTm), ఫోన్ పే (Phone Pe), గూగుల్ పే (Google Pay) వంటి యూపీఐ యాప్స్ వచ్చిన తర్వాత.. పర్సుల్లో డబ్బులే కనిపించడం లేదు. అంతా ఫోన్‌తోనే జరిగిపోతుంది. చిల్లర గొడవ ఉండదు.. పర్సు పోతుందన్న భయం ఉండదు.. అందుకే దాదాపు అందరూ డిజిటల్ పేమెంట్స్‌కే జై కొడుతున్నారు. ఐతే ఈ డిజిటల్ లావాదేవీలు (Digital Transactions) పెరిగినట్లుగానే.. ఇందులో మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. నకిలీ యాప్స్‌తో కొందరు కేటుగాళ్లు వ్యాపారులను బురిడీకొట్టిస్తున్నారు. డబ్బులు పంపినట్లుగా ఫోన్‌లో పేమెంట్స్ డీటెయిల్స్ చూపిస్తారు.. కానీ డబ్బులు మాత్రం షాపు ఓనర్ ఖాతాలోకి రావు. ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరుగుతున్నాయి.

  రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి ఏపీకి మరో 4 స్పెషల్  ట్రైన్లు

  ముంబైకి చెందిన ఓ వ్యక్తి స్థానికంగా రెస్టారెంట్ నడుపుతున్నాడు. ఇటీవల కొందరు వ్యక్తులు ఆయన హోటల్‌కు వెళ్లి భోజనం చేశారు. పార్టీ చేసుకున్నారు. అనంతరం బిల్లును క్యాష్ రూపంలో కాకుండా పేటీఎం ద్వారా చెల్లించారు. డబ్బులు పంపించినట్లు స్క్రీన్ షాట్స్ కూడా చూపించారు. అందులో హోటల్ పేరు, డబ్బులు పంపిన సమయం, ట్రాన్సాక్షన్ సక్సెస్ వంటి వివరాలున్నీ బాగానే ఉన్నాయి. కానీ అతడికి మాత్రం డబ్బులు రాలేదు. ఈ విషయాన్ని వారికి చెబితే మాకే సంబంధం లేదు.. మేమైతే డబ్బులు పంపించాం.. ఇదిగో ఆధారాలు అని ఫోన్ చూపించారు. బ్యాంక్ సర్వర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా ఒక్కోసారి ఆలస్యంగా పడతాయని.. మా ఖాతాల నుంచైతే డబ్బులు కట్ అయ్యాయని చెప్పారు. ఆ హోటల్ యజమాని బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. అసలు అలాంటి లావాదేవీలే జరగలేదని చెప్పడంతో ఆయన ఖంగుతిన్నాడు. చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

  Family car: ఫ్యామిలీ కారును కొనాలని చూస్తున్నారా..బెస్ట్ చాయిస్‌లు ఇవే.

  పోలీసులు హోటల్‌కు వెళ్లి సీసీ కెమెరాలను పరిశీలించారు. మొబైల్ నెంబర్ల ఆధారంగా ఆ వ్యక్తులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారిస్తే అప్పుడు నిజం బయటకు వచ్చింది. వాస్తవానికి వారు డబ్బులు చెల్లించలేదు. ఒక నకిలీ పేటీఎంను ఉపయోగించి.. నిజంగానే డబ్బులు చెల్లించినట్లుగా బురిడీ కొట్టించారు. అది చూసేందుకు అచ్చం పేటీఎం యాప్‌లానే ఉంటుంది. అందులో మీరు డబ్బులు చెల్లించాల్సిన దుకాణం లేదా వ్యక్తి పేరు, అమౌంట్ ఎంటర్ చేస్తే.. చాలు పేమెంట్ అయిపోయినట్లుగా ఓ సందేశం చూపిస్తుంది. ఇది అచ్చం ఒరిజినల్ పేటీఎం యాప్‌లో చూపించినట్లుగానే ఉంటుంది. ఇలా నకిలీ యాప్‌తో దుకాణదారులను మోసం చేస్తున్నారు. పోలీసులు ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు.

  ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే గంటలో హైదరాబాద్ నుంచి బెజవాడ వెళ్లిపోవచ్చట..

  దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. మోసగాళ్లు తమకు పెద్దగా తెలియని షాప్‌లో ఇలాంటి ప్రయోగాలు చేయరు. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది పేటీఎం స్పీకర్స్ వాడుతున్నారు. ఎవరైనా పేమెంట్ చేస్తే స్పీకర్ నుంచి సౌండ్ వస్తుంది. మీ అకౌంట్లో ఇన్ని డబ్బులు జమ అయ్యాయని సందేశం వాయిస్ రూపంలో వస్తుంది. అలాంటి చోట్ల వీరి పప్పులు ఉండవు. అందుకే పేటీఎం స్పీకర్ లేని దుకాణాల్లోనే మోసాలకు పాల్పడుతారు. ఒకసారి మాత్రం నిజంగానే పేమెంట్ చేసి.. ఆ దుకాణం పేరు వంటి వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత డమ్మీ పేటీఎం యాప్ ఉపయోగించి.. ఆ షాప్ పేరు, డబ్బులు ఎంటర్ చేసి.. డబ్బులు పంపినట్లుగా ఓ సందేశాన్ని చూపిస్తారు. రాలేదని అడిగితే.. బ్యాంక్ సమస్యని చెప్పి.. అక్కడి నుంచి ఉడాయిస్తారు.

  కార్ల తయారీకి క్యూ కట్టిన మొబైల్ తయారీ కంపెనీలు.. ఎందుకిలా జరుగుతోంది?

  ఇలాగే మోసం చేస్తూ ఇటీవల ఓ యువతి అడ్డంగా దొరికిపోయింది. దుకాణాలకు వెళ్లడం.. నకిలీ యాప్‌తో పేమెంట్ చేస్తున్నట్లు నటించడం.. అలవాటయిపోయింది. ఆమె కొంతకాలంగా నకిలీ పేటీఎం యాప్‌తో మోసం చేస్తుందని తెలిసి.. కొందరు యువకులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


  ఇలాంటి వారి పట్ల అప్రమత్తగా ఉండాలి. ఏ మాత్రం అనుమానం కలిగినా.. వారి పేటీఎం యాప్ ఓపెన్ చేయించి.. ట్రాన్సాక్షన్ హిస్టరీని చెక్ చేయాలి. అక్కడ అన్ని వివరాలు ఉంటాయి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Business, Crime, Crime news, Paytm

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు